'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

ఠాగూర్
శుక్రవారం, 20 జూన్ 2025 (17:28 IST)
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంగా ఇరాన్ దేశంలో ఉన్న భారత పౌరులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇందుకోసం కేంద్రం ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఇరాన్‌లో చిక్కుకునిపోయిన భారత పౌరులను స్వదేశానికి తరలించేందుకు వీలుగా ఆపరేషన్ సింధును చేపట్టింది. ఇందులోభాగంగా, ఇరాన్‌కు భారత్ ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఈ విమానాల్లో భారత పౌరులు స్వదేశానికి చేరుకుంటున్నారు. 
 
అయితే, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే, భారత్ వినతి మేరకు ఆపరేషన్ సింధు కోసం ఇరాన్ తన గగనతలాన్ని తెరిచింది. ఫలితంగా ఇరాన్‌లోని పలు నగరాల నుంచి ప్రత్యేక విమానాలు భారత్‌కు రానున్నట్టు తెలుస్తోంది. తొలి విమానం శుక్రవారం రాత్రి 11 గంటలకు ఢిల్లీకి చేరుకోనుండగా, మరో రెండు విమానాలు శనివారం దిగనున్నట్టు సమాచారం. అయితే, దీనికి ముందు ఇరాన్ నుంచి ఇప్పపటికే 110 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నప్పటికీ వీరు తొలుత ఆర్మేనియా అక్కడ నుంచి భారత్‌కు వచ్చారు.
 
వారం క్రితం ఇజ్రాయెల్ చేసిన మెరుపుదాడులతో ఇరాన్‌లోని అనేక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అనంతరం ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్‌లతో టెహ్రాన్ ప్రతిదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా భారతీయ విద్యార్థులను తరలించేందుకు ఇరాన్ ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వడంతో తరలింపు ప్రక్రియ సులభంకానుంది. ఇదిలావుంటే ఇరాన్‌లో దాదాపు 4 వేలమంది భారతీయులు ఉండగా, అందులో 2 వేల మంది విద్యార్థులేనని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం