Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని చంపిన వ్యక్తికి పరిహారం... ఎవరు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (17:50 IST)
నిందితునిగా 39 సంవత్సరాలు జైల్లో గడిపినందుకు పరిహారంగా కాలిఫోర్నియా ప్రభుత్వం ఓ వ్యక్తికి రోజుకు 140 డాలర్లు (రూ.9,500పైగా) ప్రకటించింది. చేయని తప్పుకు శిక్ష అనుభవించాడని రుజువుకావడంతో ప్రభుత్వం ఇలా చేసింది. 40 సంవత్సరాల క్రితం తన ప్రియురాలిని మరియు తన నాలుగేళ్ల కొడుకుని దారుణంగా హత్య చేసాడని నింద ఆరోపించబడి అతడిని అరెస్ట్ చేశారు. 
 
కానీ అతను తాను ఈ హత్యలు చేయలేదని ఎంత మొరపెట్టుకున్నా కోర్టు అతడిని నమ్మలేదు. దాంతో అతడిని దోషిగా నిర్ణయించి జీవిత ఖైదు విధించింది కోర్టు. కానీ ఆ వ్యక్తి తన పట్టు విడవలేదు. తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి కోర్టులో హంతకుడు కాదని నిరూపించుకున్నాడు. 
 
దాంతో పొరపాటున అతనికి శిక్ష విధించామని పశ్చాత్తాప్పడిన కాలిఫోర్నియా ప్రభుత్వం అతడికి జైల్లో గడిపినన్ని రోజులు రోజుకి 140 డాలర్లు చొప్పున ప్రకటించింది. లెక్క గట్టి 1.95 మిలియన్ డాలర్లు (రూ.14కోట్లకు పైగా) చెల్లించింది. దాంతో అతడు ఓ ఇల్లు కొనుక్కొని అందులో ఉంటున్నాడు. 
 
అతడు కోల్పోయిన జీవితాన్ని తిరిగి ఇవ్వలేమని భావించిన ఆ ప్రభుత్వం అతనికి ఇంకా సహాయం చేయాలనుకుంది. 21మిలియన్ డాలర్లు (150 కోట్లు) చెల్లిస్తామని ప్రకటించింది. అతడు కోల్పోయిన జీవితంతో పోలిస్తే ఇది చాలా చిన్న సహాయం అని పేర్కొంది. 71 ఏళ్ల క్రైగ్ ఆ డబ్బుతో తాను చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చూస్తానని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments