Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌కు భారత్‌ నిజమైన మిత్రదేశం.. ప్రధాని షేక్ హసీనా

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (17:14 IST)
Modi _Hasina
బంగ్లాదేశ్‌కు భారత్‌ నిజమైన మిత్రదేశమని ఆ దేశ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వర్చువల్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1971 యుద్ధంలో బంగ్లాకు మద్దతు ఇచ్చినందుకు దేశానికి, భారత సైన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 'డిసెంబర్ బంగ్లాదేశీయుల్లో ఆనందం, స్వేచ్ఛ, వేడుకల స్ఫూర్తిని రేకెత్తిస్తుందని' అన్నారు. 
 
భారత్‌ సారథ్యంలో తాము గొప్ప స్వాతంత్య్రాన్ని సంపాదించామన్నారు. ఈ సందర్భంగా యుద్ధంలో మరణించిన మూడు మిలియన్ల మంది అమర జవాన్లకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మా దేశం కోసం తమ హృదయపూర్వక మద్దతును అందించిన ప్రభుత్వానికి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. 
 
ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, బంగబంధు ముజిబుర్‌ రెహ్మాన్‌ డిజిటల్‌ ఎగ్జిబిషన్‌ ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే 55 సంవత్సరాలుగా నిలిచిపోయిన చిలహతి, బెంగాల్‌ హల్దిబారి రైలు మార్గాన్ని ఇద్దరు ప్రధానులు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments