డొమినోస్ నుంచి పిజ్జాలే కాదు.. ఇక రూ.99లకే దమ్ బిర్యానీ!!

Webdunia
గురువారం, 17 డిశెంబరు 2020 (16:49 IST)
డొమినోస్ పిజ్జాలను తయారు చేసే సంస్థ జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ (జేఎఫ్ఎల్‌) ఇక బిర్యానీ మార్కెట్‌లోకీ అడుగుపెట్టనుంది. ఏక్‌దమ్ పేరుతో కొత్త బ్రాండ్ బిర్యానీని తీసుకొస్తోంది.

బిర్యానీతోపాటు కబాబ్‌లు, కూరలు, బ్రెడ్స్‌, రైతాలు, చట్నీలు, డెజర్ట్‌లు కూడా తీసుకురావాలని జేఎఫ్ఎల్ నిర్ణయించింది. అంతేకాదు.. ఏక్‌దమ్ బిర్యానీ కేవలం రూ.99 నుంచే అందుబాటులో ఉంటుందని కూడా సంస్థ ప్రకటించింది.
 
ఈ బ్రాండ్ కింద ఏకంగా 20 రకాల బిర్యానీ రుచులను అందించనుంది. అందులో మన హైదరాబాదీ నిజామీ బిర్యానీ, లక్నవీ నవాబీ బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, బటర్ చికెన్ బిర్యానీలాంటివి ఉన్నాయి.

ప్రస్తుతానికి గురుగ్రామ్‌లోని మూడు రెస్టారెంట్లలో ఈ బిర్యానీని అందుబాటులోకి తీసుకొచ్చిన జేఎఫ్ఎల్‌.. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా తమ బిర్యానీ రుచులను అందించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora: చావు పుట్టుక‌ల భావోద్వేగాన్ని తెలియ‌జేసే దండోరా టీజ‌ర్‌

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments