Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2020లో హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ 5 మిలియన్‌ యూనిట్‌ అమ్మకాలు

2020లో హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ 5 మిలియన్‌ యూనిట్‌ అమ్మకాలు
, బుధవారం, 16 డిశెంబరు 2020 (22:40 IST)
భారతదేశంలో పవర్‌ ప్రొడక్ట్స్‌ తయారీలో అగ్రగామి హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (హిప్‌), ఇప్పుడు భారతదేశంలో తమ కార్యకలాపాలను ప్రారంభించి విజయవంతంగా 35 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ మధురమైన ప్రయాణ సమయంలో, భారతదేశంతో పాటుగా విదేశాలలో ఐదు మిలియన్లకు పైగా వినియోగదారులకు సంతోషాలను హిప్‌ తీసుకువచ్చింది. తమ మహోన్నతమైన  వినియోగదారుల వృద్ధిలో నమ్మకమైన భాగస్వామిగా కంపెనీ తమ లక్ష్యమైన ఎంపవర్‌ పీపుల్‌, టు డు బెటర్‌కు అనుగుణంగా నిలుస్తుంది.
 
భారతదేశంలో పోర్టబల్‌ జనరేటర్‌ మోడల్‌ ఈఎం 650ను మొట్టమొదటిసారిగా హిప్‌ ఆవిష్కరించింది. దాదాపు 100కు పైగా డీలర్‌షిప్స్‌ నెట్‌వర్క్‌తో ఈ కంపెనీ విస్తృతశ్రేణి ఉత్పత్తులు అయినటువంటి పోర్టబల్‌ వాటర్‌ పంపులు, జనరల్‌ పర్పస్‌ ఇంజిన్స్‌, పవర్‌ టిల్లర్స్‌, బ్రష్‌ కట్టర్స్‌, లాన్‌ మూవర్స్‌ను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 600కు పైగా ఛానెల్‌ భాగస్వాముల నెట్‌వర్క్‌ మద్దతుతో ఆవిష్కరించారు.
 
2003లో మొత్తంమ్మీద ఒక మిలియన్‌ యూనిట్‌ల మార్కును చేరుకుంది. 2017లో 4 మిలియన్‌ల మార్కును చేరుకుంటే, 2020లో 5 మిలియన్‌ల మార్కును చేరుకుంది. అంటే మూడు సంవత్సరాల స్వల్పకాలంలోనే ఈ మైలురాయి చేరుకుంది. భారతదేశీయ మార్కెట్‌తో పాటుగా హిప్‌ ఉత్పత్తులు ఇప్పుడు దాదాపు విదేశాలతో సహా 50 మార్కెట్లకు  ఎగుమతి చేయబడుతున్నాయి. వీటిలో యుఎస్‌ఏ, యూరోప్‌, జపాన్‌ వంటి దేశాలు కూడా ఉన్నాయి.
 
తకహిరో యుఎడా, సీఎండీ, ప్రెసిడెంట్‌ అండ్‌ సీఈవో, హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘మా వినియోగదారులకు నిబద్ధతతో సేవలనందించడం ప్రారంభించి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలోనే 5 మిలియన్‌ యూనిట్ల మైలురాయిని చేరుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. సరైన ధరలలో అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడానికి మా మహోన్నతమైన వినియోగదారులు మాకు స్ఫూర్తినందిస్తున్నారు. ఇది అసాధారణ ప్రయాణం మరియు మేము అత్యాధునిక సాంకేతికతను అందిస్తూనే సాటిలేని విలువను సైతం వినియోగదారులకు అందిస్తున్నాం’’ అని అన్నారు.
 
భారతదేశపు మార్కెట్‌లో 1985లో ప్రవేశించిన మొట్టమొదటి జపనీస్‌ బహుళజాతి సంస్థ హిప్‌. తద్వారా భారత్‌ మరియు జపాన్‌ నడుమ ఆర్థిక సంబంధాలను బలోపేతం అయ్యాయి. ఆరంభం నాటి నుంచి, ఈ కంపెనీ వినూత్నమైన, పర్యావరణ అనుకూల, అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులను తమ వినియోగదారులకు భారతదేశ వ్యాప్తంగా పవర్‌ బ్యాకప్‌, వ్యవసాయం, నిర్మాణ రంగాలలో అందిస్తున్నారు.
 
ఆప్రమప్తత కలిగిన కార్పోరేట్‌గా ఈ కంపెనీ ఇప్పుడు కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటుగా తమ గ్రేటర్‌ నోయిడా ఫ్యాక్టరీలో ఉద్యోగావకాశాలనూ సృష్టిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో విపత్తు ఉపశమన కార్యక్రమాలకు సైతం హిప్‌ మద్దతునందిస్తుందిజ దీనిలో భాగంగా కోవిడ్ 19 మహమ్మారితో పోరాటంలో సైతం కంపెనీ తన మద్దతును విస్తరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాళ్లను చుట్టుకున్న కొండ చిలువ.. విడిపించుకోలేక నానా తంటాలు