Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిసిఫర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న సైయంట్‌

Advertiesment
Cyient Signs
, మంగళవారం, 15 డిశెంబరు 2020 (17:24 IST)
అంతర్జాతీయ ఇంజినీరింగ్‌, తయారీ, డిజిటల్‌ పరవర్తన మరియు సాంకేతిక పరిష్కారాల కంపెనీ, సైయెంట్‌ నేడు పెర్త్‌ కేంద్రంగా కలిగిన డిసిఫర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది. టైలింగ్‌ స్టోరేజీ సదుపాయాల కోసం క్లౌడ్‌  పర్యవేక్షణ మరియు పరిపాలన వేదికను డిసిఫర్‌ అందిస్తుంది. ఈ ఎంఓయులో భాగంగా సైయెంట్‌ ఇప్పుడు డిసిఫర్‌కు తమ క్లౌడ్‌ మైనింగ్‌ ప్లాట్‌ఫామ్‌తో టైలింగ్స్‌ మరియు పునరావాస పర్యవేక్షణతో మద్దతునందించనుంది.
 
టైలింగ్స్‌ అంటే మినరల్‌ వ్యర్ధాలు. ముడి ఖనిజ ప్రాసెసింగ్‌ తరువాత మినరల్‌ సాంద్రతలను ఒడిసిపట్టే క్రమంలో ఇవి ఉద్భవిస్తాయి మరియు వీటిని ఇంజినీర్డ్‌ కంటెయిన్‌మెంట్‌ నిర్మాణంలో భద్రపరుస్తారు. దీనినే టైలింగ్‌ స్టోరేజీసదుపాయం (టీఎస్‌ఎఫ్‌) అంటారు. అంతర్జాతీయంగా 3500 యాక్టివ్‌ టీఎస్‌ఎఫ్‌ లు ఉన్నాయని అంచనా. ఇవి దాదాపు ఒక మిలియన్‌ హెక్టార్ల భూమిని ఆక్రమించాయి మరియు వీటిలో చాలా వరకూ పనికిరానటువంటివి లేదా వదిలివేయడమూ జరిగింది.
 
టైలింగ్‌ స్టోరేజీ సదుపాయాలు విఫలం కావడం వల్ల అనియంత్రితంగా నీరు, వ్యర్థపదార్ధాలు లేదా పర్యావరణానికి హాని కలిగించే విషపదార్థాలూ విడుదల కావొచ్చు. క్లౌడ్‌ మైనింగ్‌ ప్లాట్‌ఫామ్‌తో, మైనింగ్‌ కంపెనీలు ఇప్పుడు మాన్యువల్‌ ప్రక్రియలను భర్తీ చేయడంతో పాటుగా అపరిపక్వ సమాచారాన్ని మరింత స్పష్టమైన మరియు సురక్షిత క్లౌడ్‌ వేదిక ద్వారా భర్తీ చేయవచ్చు. ఇది అత్యాధునిక పరిశ్రమ ప్రక్రియలకు కట్టుబడి ఉండటంతో పాటుగా నిర్ధారిత ప్రమాణాలనూ అనుసరిస్తాయి. సైయెంట్‌ మరియు దాని అనుబంధ సంస్థలు, ఐజీ భాగస్వాములు విక్రయాలు , అమలులో ప్రతిష్టాత్మక పాత్రను పోషించడంతో పాటుగా ముందుకు వెళ్లే కొద్దీ ఈ పరిష్కారాలకు మద్దతునందిస్తుంది.
 
ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలను గురించి హెర్మాన్‌ క్లీన్హాన్స్‌, సెక్టార్‌ హెడ్- మైనింగ్‌, సైయెంట్‌ మాట్లాడుతూ, ‘‘డిసిఫర్‌ యొక్క సంపూర్ణమైన పరిష్కారాలు మరియు టీఎస్‌ఎఫ్‌ పర్యవేక్షణ మరియు పరిపాలనకు సంబంధించి లోతైన అవగాహనతో సైయెంట్‌ యొక్క సాంకేతికత, అంతర్జాతీయ చేరిక మిళితమై మా మైనింగ్‌ ఖాతాదారులకు అసాధారణ ప్రయోజనం తీసుకువస్తుంది. ఈ భాగస్వామ్యం సానుకూల పర్యావరణ ప్రభావం తీసుకురావడంతో పాటుగా అంతర్జాతీయంగా మైనింగ్‌ కార్యకలాపాలలో ఉన్న ప్రజల భద్రత పరంగా కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది’’ అని అన్నారు.
 
డిసిఫర్‌ యొక్క సీఈవో, ఆంథోనీ వాకర్‌ మాట్లాడుతూ, ‘‘అంతర్జాతీయంగా అగ్రగామి సైయెంట్‌ యొక్క అనుభవం మరియు చేరిక, అంతర్జాతీయంగా మా వినియోగదారులకు మెరుగైన పరిష్కారాలను అందించడంలో మాకు మద్దతునందిస్తుంది. పరిశ్రమను సవాలు చేయడంలో మరియు నడిపించడంలో అంతర్జాతీయ పరిశ్రమ టైలింగ్స్‌ ప్రమాణాలు తీసుకున్న గొప్ప ప్రగతికి డిసిఫర్‌ అందిస్తున్న మద్దతు మరియు వ్యవస్ధల అవసరం ఉంది. సైయెంట్‌ మరియు దాని అనుబంధ సంస్థ ఐజీ పార్టనర్స్‌ ఇప్పుడు మాతో చేతులు కలుపడంతో పాటుగా ఈ భాగస్వామ్యంను విజయవంతం చేయనుండటం పట్ల సంతోషంగా  ఉన్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ మార్కెట్లోకి నోకియా సీ1 ప్లస్.. ధర రూ.6,200