Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ అప్రమత్తం.. ఆప్ఘన్ నుంచి రావాలంటే ఈ వీసా తప్పనిసరి

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (14:10 IST)
ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల పాలన ఏర్పడటంతో దౌత్యపరంగా భారత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంక్షల్ని కఠినం చేస్తోంది.
 
మారుతున్న ఆఫ్ఘన్ పరిణామాల్ని పొరుగు దేశమైన ఇండియా ఓ కంట కనిపెడుతోంది. ఆఫ్ఘన్‌కు సరిహద్దు దేశమైన పాకిస్తాన్ తాలిబన్లకు వత్తాసు పలకడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. దౌత్యపరంగా ఇండియా కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకుంటోంది. ఆఫ్ఘన్ నుంచి ఇండియాకు రావాలంటే ఈ వీసా తప్పనిసరి అంటోంది. 
 
ఇండియాకు వచ్చే విమాన మార్గంలో ఈ వీసా ఉంటేనే ఆఫ్ఘన్ పౌరుల్ని అనుమతిస్తామని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ వీసా తీసుకోవాలంటే అక్కడి రాయబార కార్యాలయానికి నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. 
 
సంక్షోభ పరిస్థితుల కారణంగా ఎంబసీను మూసేయడంతో ఈ వీసా(E Visa) దరఖాస్తు అనివార్యమైంది. ఈ వీసా ఆరు నెలల వరకూ చెల్లుబాటవుతుంది. సాధారణ వీసాలు లభ్యమై..ఇండియాకు చేరకపోతే ఆ వీసాలు చెల్లుబాటు కావు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments