Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విస్త‌రించేందుకు బిజేపీ విస్తార‌క్ యోజ‌న‌

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (13:47 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఉనికి అంతంత మాత్ర‌మే. అందుకే రాష్ట్రంలో మ‌రింత విస్త‌రించేందుకు ఆ పార్టీ కేంద్ర నాయ‌క‌త్వం విస్తార‌క్ యోజ‌న‌ను ప్ర‌వేశ‌పెట్టింది. 
 
క్షేత్రస్ధాయిలో  కేంద్ర పధకాలకు బిజెపి స్థానిక నేత‌లు విస్తృత ప్రచారం చేస్తున్నారు. విస్తారక్ యోజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని వెయ్యి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు రేషన్ డిపోలు,  వ్యాక్సిన్ సెంటర్లను పరిశీలించారు. రేషన్ డిపోల ద్వారా బియ్యం పంపిణీ ఎలా జరుగుతోంది?  ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు? అనే విషయాలు తెలుసుకోవడంతో పాటు ప్రధాని నరేంద్రమోదీ అందిస్తున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించారు. రేషన్ డిపోల వద్ద  ప్రజల ఫిర్యాదులను కూడా తీసుకుని, పరిష్కార మార్గాలు బిజెపి నాయకులు క‌నుగొంటున్నారు.
 
దేశమంతటా కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తున్న విధానాన్ని ప్రజలకు బిజెపి నేతలు వివరించారు. ఈ విధంగా రెండు రోజుల పాటు పార్టీ కార్యక్రమాన్ని ద్విగ్విజయం చేసినందుకు ఎపి బిజెపి అధ్యక్షులు  సోమువీర్రాజు బిజెపి శ్రేణులను అభినందించారు. పార్లమెంటు నియోజక వర్గాల వారీగా  మండలాల్లో విస్తారక్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ  కార్యక్రమాలను నిర్వహించారు.
 
బిజెపి పధాదికారులతో సహా అందరూ విస్తారక్ లుగా పనిచేయడం విశేషం. జిల్లా, మండల, గ్రామాల వారీగా  కార్యక్రమ పర్యవేక్షణ జరిగింది. 934 మండలాల్లో విస్తారక్ యోజన నిర్వహించారు.ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.  విస్తార‌క్ ద్వారా మ‌రింత విస్త‌రిస్తామ‌ని బీజేపీ నాయ‌కులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments