Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాలలో చీనీ-నిమ్మ సాగుకు సాంకేతిక సలహా సంప్రదింపులలో సంహిత ఓ నూతన అధ్యాయం

ఆంధ్ర-తెలంగాణా రాష్ట్రాలలో చీనీ-నిమ్మ సాగుకు సాంకేతిక సలహా సంప్రదింపులలో సంహిత ఓ నూతన అధ్యాయం
, బుధవారం, 25 ఆగస్టు 2021 (22:42 IST)
భారతదేశంలో చీనీ-నిమ్మ పంటల ఉత్పత్తి సరాసరి 5.24% వార్షిక వృద్ధి రేటుతో 1970లోని 17.3 లక్షల టన్నులు నుంచి 2019 నాటికి 140 లక్షల టన్నులకు చేరింది. ఉత్పత్తి పరంగా ప్రపంచ వ్యాప్తంగా మూడవ ర్యాంకును ఇండియా సొంతం చేసుకున్నప్పటికీ, చైనా సాధించిన 428 లక్షల టన్నుల ఉత్పత్తి మరియు బ్రెజిల్‌ సాధించిన 193 లక్షల టన్నుల దిగుబడితో పోలిస్తే ఇక్కడ దిగుబడి స్వల్పమే.
 
ఇక ఉత్పాదకత పరంగా, ఇండోనేషియా, టర్కీ, బ్రెజిల్‌ మరియు యుఎస్‌ఏ లాంటి దేశాలతో పోల్చినప్పుడు మనం చాలా దూరంలో ఉన్నాం. ఆ దేశాలలో సగటున హెక్టార్‌కు 22-35 టన్నుల దిగుబడి సాధిస్తుంటే, భారతదేశంలో ఇది హెక్టారుకు 8.8 టన్నులు మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాలు అత్యధికంగా స్వీట్‌ ఆరెంజ్‌ (బత్తాయి) పండిస్తున్నాయి. ఉత్పత్తిపరంగా ఇక్కడ పెను సవాళ్లుగానిలుస్తున్న అంశాలలో ఉత్పాదక వ్యయం పెరగడం, చెట్ల జీవిత కాలం తక్కువగా ఉండటం, పండ్ల నాణ్యత సరిగా లేకపోవడంకు తోడు అసాధారణ మార్కెట్‌ ఒడిదుడుకులు వంటివి ఉంటున్నాయి.
 
హైదరాబాద్‌ కేంద్రంగా కలిగిన ఖచ్చితమైన వ్యవసాయ సలహా సంస్థ సంహిత క్రాప్‌ కేర్‌ క్లీనిక్స్‌, తమ అనుభవజ్ఞులైన వ్యవసాయ నిపుణులతో కూడిన బృందంతో తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో చీనీ-నిమ్మ సాగుదారులకు తగిన సలహాలను అందిస్తూ మెరుగైన దిగుబడులు సాధించేందుకు సహాయపడుతుంది. టెలిమెట్రిక్స్‌, డ్రోన్లు, కస్టమైజ్డ్‌ యాప్‌ల సహాయంతో ఈ ప్లాంట్‌ డాక్టర్లు పండ్ల తోటలను పర్యవేక్షిస్తున్నారు. సంహిత యొక్క వినూత్నత ఏమిటంటే, ఈ సలహాలను మొత్తం తోటకు కాకుండా నిర్థిష్టమైన చెట్ల వరకూ కూడా అందించడం. తోటల జీవితకాలం రెట్టింపు కాలం వృద్ధి చేయడంతో పాటుగా ఉత్పాదకతను 30% కు పైగా వృద్ధి చేయాలనేది వీరి ప్రధాన లక్ష్యం.
 
సంహిత సీఈవో, ఐఐఐటీ హైదరాబాద్‌ పూర్వ ఫ్యాకల్టీ, సీనియర్‌ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం (ఐసీఏఆర్‌) హెడ్‌ డాక్టర్‌ జి. శ్యామసుందర్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘‘తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్‌లలో చీనీ-నిమ్మ పంటల దిగుబడి అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే  సగం కన్నా తక్కువగా ఉంది. చీనీ-నిమ్మ పంట రైతులు తప్పనిసరిగా ఎరువులు, కలుపు సంహారకాలు వాడాల్సి వస్తుంది. వీటి వినియోగం వల్ల పంట దిగుబడి పెరగవచ్చేమో కానీ పంట జీవిత కాలం గణనీయంగా తగ్గిపోతుంది’’ అని అన్నారు.
 
‘‘సంహిత వద్ద, మేము అత్యాధునిక సాంకేతికతను వినియోగించి భూమి, నీరు, పంట గురించిన పరిజ్ఞానం సృష్టిస్తుంటాం. ఈ సలహాలు సమగ్రంగా ఉండటంతో పాటుగా నిరంతరరాయంగా కొనసాగుతూ, రైతులకు ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటాయి. వీటన్నిటినీ మించి, తమ సొంత గ్రామాలు లేదా చుట్టుపక్కల వందలాది గౌరవ ప్రదమైన ఉద్యోగాలను గ్రామీణ యువత కోసం సంహిత  సృష్టిస్తుంది. ఇది తమకు ఎంతో ఆనందం కలిగిస్తుంది’’అని హార్వార్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి; సంహిత మేనేజింగ్‌ డైరెక్టర్‌ జగన్‌ చిటిప్రోలు అన్నారు.
 
చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ శ్రీ కళ్యాణ్‌ ఇంజామూరి మాట్లాడుతూ, ‘‘మేము ప్రతి మొక్కనూ పరిశీలించడం ద్వారా ప్రాదేశిక మరియు తాత్కాలిక డాటాను  నిర్మిస్తుంటాం. ఈ డాటా విశ్లేషణల ద్వారా తెలుసుకున్న అంశాలతో పాటుగా లోతైన అభ్యాసం వంటివి ప్లాంట్‌ డాక్టర్లు మరియు క్షేత్రస్ధాయి సిబ్బంది పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడతాయి. ఆర్టిఫిషీయల్‌ ఇంటిలిజెన్స్‌ మరియు మెషీన్‌ లెర్నింగ్‌ (ఏఐ అండ్‌ ఎంఎల్‌) సహాయంతో వీలైనంతగా ఆప్టిమైజేషన్‌ మరియు ఆటోమేషన్‌ కోసం మేము సిద్ధమయ్యాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య ఖాతాలో భర్త రూ. 39 లక్షలు డిపాజిట్, తిరిగి వచ్చేసరికి భార్య లేదు, డబ్బూ లేదు