Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి.. వచ్చే నెలలో రష్యా నుంచి భారత్‌కు..?

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (22:31 IST)
భారత్‌‌లో వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో రష్యా నుంచి భారీగా సన్‌ ఫ్లవర్ ఆయిల్ దిగుమతికి భారత కంపెనీలు సిద్ధమయ్యాయి. తాజాగా రష్యా నుంచి 45 వేల టన్నుల సన్‌ ఫ్లవర్ ఆయిల్‌ దిగుమతికి భారత్ ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
ఈ షిప్‌ మెంట్ వచ్చే నెలలో భారత్‌‌కు చేరుతుందని సమాచారం. టన్ను సన్‌ ఫ్లవర్ ఆయిల్‌‌ను 2,150 డాలర్లకు భారత్ కొనుగోలు చేస్తోంది. ఇది రికార్డు ధర. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముందు ఈ ధర కేవలం 1,630 డాలర్లుగానే ఉండేది. 
 
గత నెల రోజులుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం కుదరలేదని, కానీ ఇప్పుడు దిగుమతులకు కూడా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ)లు లభిస్తున్న తరుణంలో మళ్లీ రష్యా నుంచి కొనుగోళ్లు ప్రారంభించారని దిగుమతి వ్యాపారులు చెబుతున్నారు. ఇక, వంట నూనెలకు ఉన్న డిమాండ్‌తో ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments