Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతదేశంలోని సగం మంది సరిగా నిద్రపోలేకపోతున్నారు, ఎందుకు?

భారతదేశంలోని సగం మంది సరిగా నిద్రపోలేకపోతున్నారు, ఎందుకు?
, సోమవారం, 28 మార్చి 2022 (19:25 IST)
నిద్ర అన్నది బలహీనులకు మాత్రమే అని కెరీర్‌పై దృష్టి సారించిన వ్యక్తి గతంలో ఓసారి అన్నారు. దురదృష్టవశాత్తు చాలామంది ఆ మాటను నిజమని నమ్మి చక్కని నిద్రను విస్మరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పడుకోవడం, తెల్లవారక ముందే మేల్కోవడం ఆలవాటుగా మారింది. మహమ్మారి అనంతర కాలంలోనూ అదే ధోరణి కొనసాగుతోంది.

 
అదృష్టవశాత్తూ రాత్రివేళ మంచి చక్కని నిద్ర అవసరమని ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాలు నొక్కి చెప్పాయి. సరైన నిద్ర ఉంటే చక్కని శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యం కలిగి ఉంటారని రుజువైంది. మంచి నిద్ర రావడమన్నది సవాల్‌గా నిలుస్తోంది. ఇటీవల, ResMed ఒక నిద్ర అధ్యయనాన్ని నిర్వహించి భారతదేశవ్యాప్తంగా 5,000 మందిని ప్రశ్నించింది. ఈ అధ్యయనంలో శుభసమాచారమూ ఉంది దుర్వార్తలు ఉన్నాయి. శుభవార్త ఏంటంటే, చాలా మంది భారతీయులు మంచి రాత్రి నిద్ర అందరికీ అవసరమని విశ్వసిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 81 శాతం మంది నిద్ర చక్రం వారి జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

 
ఈ సర్వేలో వచ్చిన సానుకూలాంశం ఇదొక్కటే. భారతీయులు నిద్రపోవడానికి ఎక్కువ సమయం (సగటు సమయం సుమారు 90 నిమిషాలు) తీసుకుంటారని మేము గ్రహించాము. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అందులో ఒత్తిడి, నిద్రపోయే ముందు స్క్రీన్ సమయం సహా అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. 59 శాతం మంది గురకను మంచి రాత్రి నిద్రకు చిహ్నంగా భావించారు, అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ అప్నియా (OSA) గురించిన పరిజ్ఞాన లేమిని ఇది తెలియజెప్తోంది.

 
సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది సరైన నిద్ర లేకపోవడం వలన మానసిక శ్రేయస్సు సరిగ్గా ఉండదని అన్నారు. సమస్య గుర్తించినప్పటికీ కేవలం 53 శాతం మంది మాత్రమే నిద్ర సమస్యల పరిష్కారానికి సాయపడే పరికరాలు ప్రయత్నించారు.

 
అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ అప్నియా అంటే ఏంటి?
అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ అప్నియా అనే పరిస్థితి ఏర్పడినప్పుడు గొంతు కండరాలు సడలించబడతాయి. ఈ కారణంగా వాయుమార్గం కుచించుకుపోతుంది లేదా మూసుకుపోతుంది. దీనివలన బిగ్గరగా గురక, నిద్రలో గాలి పీల్చుకునేందుకు ఇబ్బందిపడటం, ఉదయం తలనొప్పి, నిద్రపోవడంలో ఇబ్బంది, మేల్కొని ఉన్నప్పుడు దేనిపైనైనా శ్రద్ధ చూపలేకపోవడం, చిరాకు వంటి అత్యంత సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.

 
సాధారణ శ్వాస తాత్కాలికంగా నిరోధించబడటం, నెమ్మదిగా లేదా నిస్సారమైన శ్వాస, బిగ్గరగా గురక, పగటి పూట అధిక నిద్ర వంటివి పదే పదే చోటుచేసుకుంటే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్ అప్నియాగా దాన్ని గుర్తించవచ్చు. దీన్ని తేలికపాటి, మితస్థాయి, తీవ్రమైనదిగా కూడా వర్గీకరించవచ్చు. తేలికపాటి కేసుల్లో పైన పేర్కొన్న లక్షణాలు గంటకు 5-15సార్లు, మితస్థాయి కేసుల్లో 15-30 సార్లు, తీవ్రమైన కేసుల్లో గంటకు 30 కంటే ఎక్కువసార్లు ఉంటాయి.

 
నిద్రలేమి కారణంగా శరీరం ఎక్కువ పనిచేస్తుంది, అదే సమయంలో బ్లడ్‌ షుగర్‌ లెవల్స్ పెరిగి అది డయాబెటీస్‌కు దారితీస్తుంది. రీసెర్చ్ సొసైటీ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా 2021లో నిర్వహించిన సదస్సులో వ్యక్తమైన ఏకాభిప్రాయం...
 

టైప్ 2 డయాబెటిస్ (T2DM) రోగుల్లో స్త్రీల కంటే పురుషుల్లో OSA ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు స్థిరంగా నివేదించాయి.
 
గ్రామీణ జనాభాతో పోలిస్తే పట్టణ జనాభాలో T2DM ఉన్న రోగులలో OSA ప్రాబల్యం అధికంగా ఉంది.
 
OSA ఉండటం, దానికి చికిత్స తీసుకొని వారిలో తీవ్రతకు T2DM రోగులలో పేలవమైన గ్లైసెమిక్ నియంత్రణకు స్వతంత్రంగా సంబంధం కలిగి ఉంది.
 
T2DM రోగులలో గ్లైసెమిక్ నియంత్రణపై CPAP చికిత్స ప్రభావంపై రకరకాల ఫలితాలు ఉన్నప్పటికీ (తక్కువ నమూనా పరిమాణం, నియంత్రణ సబ్జెక్టులు లేకపోవడం), నిద్ర నాణ్యత, పరిమాణంపై CPAPకి ఉన్న అనుకూల ప్రభావాల కారణంగా OSAకి ఇప్పటికీ అదే గీటురాయిగా నిలుస్తూ ప్రథమ శ్రేణి చికిత్సగా కొనసాగుతోంది.

 
స్లీప్ అప్నియా, టైప్ 2 డయాబెటిస్ రెండూ కూడా ఒక బలమైన ముప్పుతో ముడిపడి ఉన్నాయి. అదే ఊబకాయం. అధిక బరువు అన్నది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తోంది. ఇది గొంతులోని వాయుమార్గాన్ని కూడా ఇరుగ్గా మార్చగలదు. ఇది స్లీప్ అప్నియాను ప్రేరేపిస్తుంది. స్లీప్ అప్నియాతో ముడిపడి ఉన్న ఇతర కారకాలు...

 
ధూమపానం
మద్య వినియోగం
ముక్కు దిబ్బడ
మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు

 
మధుమేహం, జీవనశైలి వ్యాధులు మాత్రమే OSA నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు కాదు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన ఒక పరిశోధనా పత్రం నిద్రలేమి, మానసిక శ్రేయస్సు మధ్య సంబంధం ఉందని నొక్కి చెప్పింది. అమెరికా సాధారణ జనాభాలో వయోజనుల్లో 10% నుంచి 18% మందితో పోలిస్తే, దీర్ఘకాలిక నిద్ర సమస్యలు సాధారణ మానసిక చికిత్సలో 50% నుంచి 80% మంది రోగులను ప్రభావితం చేస్తున్నాయి. ఆందోళన, డిప్రెషన్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ ఉన్న రోగులలో నిద్ర సమస్యలు చాలా సాధారణం అని నివేదిక పేర్కొంది.

 
మహమ్మారి, OSA
గడిచిన రెండు సంవత్సరాల్లో నిద్రలేమి స్థాయిలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. ఒక్క భారతదేశంలోనే నిద్ర నాణ్యత సరిగ్గా లేని వ్యక్తులలో 57% పెరుగుదల ఉంది. మహమ్మారి కారణంగా తలెత్తిన గాబరా, భయం వంటి అనేక అంశాలు ముఖ్యంగా వృత్తిపరమైన ఆందోళన ఈ సమస్యకు జత కలిశాయి.

 
క్రమబద్ధమైన నిద్ర వేళలు లేకపోవడం 24 గంటల దినచర్య అంటే వైద్యపరిభాషలో సర్‌కేడియున్‌ రిథమ్‌ను ప్రభావితం చేస్తుంది. టీవీ చూడటం, నిద్ర పోవడానికి ముందు మొబైల్‌ ఫోన్ చూడటం వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తాయి. రుగ్మత గురించి అవగాహన లేకపోవడం, దానికి అవసరమైన సరైన చికిత్స గురించి తెలియకపోవడమన్నది అత్యంత ఆందోళనకరమైన విషయం.

 
గత రెండు సంవత్సరాలుగా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ ఉండటంతో ప్రజలు తమ ఆరోగ్యం, బాగోగులపై దృష్టి పెట్టగలిగారు.  ఇందులో వ్యాయామం, యోగా వంటి శారీరక శ్రమతో పాటు తమకు తాముగా సమయాన్ని కేటాయించడం వంటివి ఉన్నాయి. ఈ కాలంలో ఫిట్‌నెస్ బ్యాండ్‌ల విక్రయాలు కూడా బాగా పెరిగాయి. ఫిట్‌నెస్ బ్యాండ్‌లు హృదయ స్పందన రేటు, నిద్ర సహా అనేక విషయాలు మానిటర్ చేస్తాయి.

 
జాన్స్ హాప్‌కిన్స్ మెడికల్ కాలేజ్ నివేదిక ప్రకారం స్లీప్ ట్రాకర్‌లు మీ నిద్ర అలవాట్ల గురించి చాలా సమాచారాన్ని కలిగి ఉంటాయి, అవి నిద్రను అంచనా వేయడానికి సరోగేట్‌గా పనిచేస్తాయి. ఇది ఉజ్జాయింపు సంఖ్య మాత్రమేనని,  నిద్రను సరిగ్గా కొలిచే కిట్ అవసరం.

 
ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా, ResMed మీ నిద్ర సంబంధిత సమస్యల పరిష్కారంలో సాయపడే నిద్ర ఆరోగ్య ఉత్పత్తులు ఆవిష్కరించింది. ఇవి రాత్రికి రాత్రి పరిష్కారం చూపకపోయినా రాత్రివేళ మంచి నిద్రకు, మెరుగైన ఆరోగ్య ప్రక్రియలో మెట్టుగా నిలుస్తుంది. వీటిల్లో తెల్లని కాంతిని నిరోధించే ఐ మాస్క్‌లు (సిల్క్, ఆకృతి), డ్రీమ్‌ప్యాడ్‌- విశ్రాంతిపూర్వక నిద్రను అందించే దిండు, డోడో- ఉరకలెత్తే మనస్సును ప్రశాంతపరచడంలో సాయపడే నీలికాంతిని ప్రసరింపజేసి, బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలను నిరోధించే సౌండ్ మెషీన్, CPAP వేగంగా, సులభంగా శుభ్రం చేసేందుకు CPAC (కంటిన్యూయస్‌ పాజిటివ్‌ ఎయిర్‌వే ప్రెషర్‌) వైప్‌ మాస్కులున్నాయి. మీ నిద్రను మెరుగుపరచడానికి ఈ వ్యక్తిగత ఉత్పత్తులు అన్నీ అభివృద్ధిపరిచినా మీకు ఏది సరిగ్గా పని చేస్తుందో చూడటానికి నిద్ర నిపుణుడితో మాట్లాడటం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తడి కళ్లు, అతి బరువుతో ఎగురుతున్నట్లుండే నడక... ఇలాంటివారు...