Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా మాజీ భార్యను నేను చంపలేను... కిరాయి హంతుకుడిని పిలుద్దాం...

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (17:17 IST)
భారత సంతతికి చెందిన నర్సన్ అనే ఓ అమెరికన్ తన ప్రియురాలితో కలిసి మాజీ భార్యను చంపడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఊహించని విధంగా కిరాయి హంతకుడి వేషంలో పోలీసు వచ్చి సాక్ష్యాధారాలతో అతడిని, అతడికి సహకరించిన ప్రియురాలిని అరెస్ట్ చేసారు.
 
వివరాల్లోకి వెళ్తే, 55 ఏళ్ల నర్సన్‌కు 1995లో పెళ్లైంది. వారిద్దరికీ ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 2011లో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు, ఆస్తి విషయంలో చిక్కులు ఉండటంతో ఇంకా అధికారికంగా విడాకులు మంజూరు కాకుండా కేసు కోర్టులో ఉంది. వేరే నేరంలో జైలుకు వెళ్లిన నర్సన్‌కు మరో ఖైదీ పరిచయమయ్యాడు. తనకు తన ప్రియురాలికి మధ్య అడ్డుగా వున్న తన మాజీ భార్యను చంపాలని వుందనీ, ఐతే ఆ పని నేను చేయలేను కాబట్టి అందుకోసం ఒక కిరాయి హంతకుడు కావాలని ఆ ఖైదీతో చెప్పాడు. 
 
జైలు నుండి బయటికొచ్చాక ఆ కిరాయి హంతకుడిని ఓ షాపింగ్ మాల్‌లో కలవాలనుకున్నారు. అక్కడికి వచ్చిన వ్యక్తితో నర్సన్, అతని ప్రియురాలు తమ పథకం గురించి వివరించి బేరం కుదుర్చుకున్నారు. అయితే వ్యవహారమంతా అక్కడే బెడిసికొట్టింది. వచ్చింది కిరాయి హంతకుడు కాదు, ఓ పోలీస్, అతను జరిగిన వ్యవహారాన్నంతా వీడియో తీసి, వారిద్దరినీ అరెస్ట్ చేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments