Webdunia - Bharat's app for daily news and videos

Install App

హబుల్ అరుదైన ఘనత: 30 సంవత్సరాలు అంతరిక్షంలో.. 100 కోట్ల సెకన్లు పూర్తి

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (10:44 IST)
Hubble
అంతరిక్షంలోని అతిపెద్ద టెలిస్కోప్ హబుల్ అరుదైన ఘనత సాధించింది. గత 30 సంవత్సరాలుగా అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్న హబుల్ ఇప్పటి వరకు 100 కోట్ల సెకన్ల సేవలు అందించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 25 ఏప్రిల్ 1990లో దీనిని ప్రయోగించింది. 
 
ఇందుకోసం ఏకంగా 470 కోట్ల అమెరికన్ డాలర్లు ఖర్చు చేసింది. నిన్నటితో ఇది 100 కోట్ల సెకన్లు పూర్తి చేసుకుని అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఈ 30 ఏళ్లలో అంతరిక్షానికి సంబంధించి ఎన్నో రహస్యాలను శాస్త్రవేత్తలకు అందించింది. అత్యంత అరుదైన ఫొటోలను పంపింది. 
 
నిజానికి ఈ టెలిస్కోప్‌ను 1988లోనే అంతరిక్షంలోకి పంపాలని అనుకున్నారు. అయితే, సాంకేతిక కారణాల కారణంగా రెండేళ్లు ఆలస్యమైంది. 1990లో దీనిని అంతరిక్షంలోకి పంపి కక్ష్యలో ప్రవేశపెట్టినప్పటికీ ఫోటోలు క్లియర్‌గా పంపడంలో విఫలమైంది. మరమ్మతుల అనంతరం 13 జనవరి 1994లో పూర్తి స్పష్టతతో కూడిన ఫొటోలు పంపింది. 
 
హబుల్ టెలిస్కోప్‌కు మరమ్మతుల కోసం 2009 వరకు మొత్తంగా ఐదు సార్లు వ్యోమగాములను పంపాల్సి వచ్చింది. ఫలితంగా దీని ప్రయోగం ఖర్చు 1000 కోట్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విద్యార్థుల సమక్షంలో త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి పాట విడుదల

Sidhu : జాక్ చిత్రంలో బూతు డైలాగ్ లుంటాయ్ : సిద్ధు జొన్నలగడ్డ

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments