Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రయాణీకుల గుండెల్లో దడ పుట్టించిన కిమ్.. ఖండాంతర క్షిపణి ప్రయోగంతో?

ఉత్తర కొరియా అణు క్షిపణుల ప్రయోగంతో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించింది. అయితే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హాంకాంగ్ వెళుతున్న విమానంలో ప్రయాణించిన ప్రయాణీకులను

Webdunia
బుధవారం, 17 జనవరి 2018 (10:20 IST)
ఉత్తర కొరియా అణు క్షిపణుల ప్రయోగంతో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించింది. అయితే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి హాంకాంగ్ వెళుతున్న విమానంలో ప్రయాణించిన ప్రయాణీకులను భయభ్రాంతులను చేసింది.
 
ఉత్తర కొరియా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి ఆ విమానంలో ప్రయాణిస్తున్న వారికి కనిపించింది. దీంతో వారు జడుసుకున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు కూర్చున్నారు. ఈ ఘటన గత సంవత్సరం నవంబర్ 28న జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని.. అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సేన్ విమర్శించారు. జపాన్ తీర ప్రాంతానికి 155 మైళ్ల దూరంలో విమానం ప్రయాణిస్తున్న వేళ ఈ ఘటన జరిగిందని ఆయన అన్నారు. కిమ్ వైఖరి అన్ని దేశాల ప్రజలకూ నష్టదాయకమేనని అన్నారు.
 
వివరాల్లోకి వెళితే.. హాంకాంగ్ వెళ్తున్న విమానానికి కేవలం 280 నాటికల్ మైళ్ల దూరంలో ఈ క్షిపణి వుంది. ఆ దారిలో ఆ సమయానికి తొమ్మిది విమానాలు కూడా వెళ్తున్నాయి. ఆ రోజు మొత్తం మీద 716 విమానాలు ఆ క్షిపణి రేంజ్ లోనే ప్రయాణించాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాల్సి వుందని అమెరికా డిమాండ్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments