Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయ గీతాన్ని గౌరవించకపోతే.. మూడేళ్ల జైలు ఖాయం: చైనా

సినిమా థియేటర్లలో జాతీయ గీతం అంశంపై దేశవ్యాప్త చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. దీనిపై ప్రముఖులంతా తలా ఒక మాట చెప్తూనే ఉన్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పుని

Advertiesment
China
, మంగళవారం, 31 అక్టోబరు 2017 (14:44 IST)
సినిమా థియేటర్లలో జాతీయ గీతం అంశంపై దేశవ్యాప్త చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. దీనిపై ప్రముఖులంతా తలా ఒక మాట చెప్తూనే ఉన్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాలాపనను తప్పనిసరి చేస్తూ గతేడాది సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయితే థియేటర్లలో జాతీయ గీతాన్ని పాడించడంపై సినీ నటులు కమల్ హాసన్, అరవింద్ స్వామి, సోను నిగమ్ వంటి వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే జాతీయ గీతాన్ని ఎక్కడ ప్రసారం చేసినా లేచి నిలుచుని జాతికి గౌరవం ఇవ్వాల్సిందేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో చైనా కూడా జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందేనని లైన్లోకి వచ్చింది. అంతేగాకుండా చైనా తమ జాతీయజెండాకు సంబంధించి కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. బహిరంగ ప్రదేశాల్లో తమ జాతీయ జెండాను అవమానించినా, జాతీయ గీతాన్ని గౌరవించకపోయినా మూడేళ్లు జైలు శిక్షతో పాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలో చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. 
 
జాతీయ గీతం ప్రసారం అవుతున్నప్పుడు ఎవరన్నా అవమానకరంగా ప్రవర్తిస్తే వారిని 15 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉంచాల్సిందిగా సెప్టెంబర్‌లో చైనా కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. జాతీయ గీతాన్ని గౌరవించకపోతే మూడేళ్లు జైలు శిక్ష తప్పదని డ్రాగన్ కంట్రీ  స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడే 'రేవంత్ రెడ్డి' సినిమా విడుదల... ఢిల్లీలో 'రాహుల్ గాంధీ' రిలీజ్