Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలు గోడలు బద్ధలుకొట్టుకిని వంద మంది ఖైదీలు పరార్.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 3 మార్చి 2024 (11:54 IST)
హైతీలో జైలు నుంచి ఖైదీలు పారిపోయారు. హైతీ దేశ రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతం రణరంగాన్ని తలపిస్తుంది. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలమంది ఖైదీలు శనివారం పారిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్‌ యూనియన్స్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్టు చేసింది. రాజధానిలో ఉన్న అందరు అధికారులు తక్షణమే కార్లు, ఆయుధాలు తీసుకొని జైలును అదుపు చేయడానికి రావాలని అభ్యర్థించింది. 'దాడి చేసేవారు పూర్తిగా విజయం సాధిస్తే దాదాపు 3,000 మంది నేరగాళ్లు పట్టణంలోకి వస్తారు.. ఎవరినీ వదిలిపెట్టరు' అని దానిలో పేర్కొంది. 
 
కెన్యాతో ఓ రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియల్‌ హెన్రీ ఇటీవల కెన్యా పర్యటనకు వెళ్లిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను వీరు లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. ఈ సమయంలోనే దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్‌ అ ప్రిన్స్‌ జైలుపై దాడులు మొదలయ్యాయి. 
 
ఈ జైలులో దేశాధ్యక్షుడి హంతకులతోపాటు 18 మంది కొలంబియా వాసులు కూడా ఉన్నారు. దీని సామర్థ్యం 3,900 కాగా.. 11,778 మంది ఖైదీలు ఇక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో జైలుపై శనివారం దుండగులు దాడి నిర్వహించారు. దీనిలో బాజ్‌-5 ముఠా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. జైలుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు కెన్యాతో ఒప్పందం అమల్లోకి వస్తే.. ఆ దేశ దళాలు హైతీ రక్షణకు సాయం చేస్తాయి.  దీనిపై ఓ నేరగాళ్ల ముఠా నాయకుడు జిమ్మీ చెరిజియర్‌ అలియాస్‌ బార్బెక్యూ ప్రధాని హెన్రీని పదవి నుంచి దిగిపోయేట్లు చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments