అరబిక్ భాషలో ముద్రితమైన అక్షరాలతో కూడిన డ్రెస్సును ధరించిన ఓ పాకిస్తాన్ మహిళకు లాహోర్‌లో చేదు అనుభవం ఎదురైంది. కానీ డ్రెస్సుపై అరబిక్ అక్షరాలు.. ఖురాన్‌లోనివని తప్పుగా అర్థం చేసుకున్న ఓ గుంపు ఆ మహిళను చుట్టుముట్టింది. తప్పుగా అర్థం చేసుకుని ఆ మహిళను హేళన చేసింది. ఆ మహిళ దైవ దూషణకు పాల్పడుతుందని భావించారు.
కానీ అసలు నిజం తెలుసుకున్నారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అరబిక్ భాషలో అక్షరాలు ప్రింట్ చేసి ఉన్న డ్రెస్సును ఓ పాకిస్థాన్ మహిళ ధరించింది. ఆమె వేసుకున్న దుస్తులపై ఖురాన్ వచనాలను రాశారని ఆమెను దిగ్భందించారు.
అయితే పోలీసులు ఆ హోటల్‌కు చేరుకుని ఆమెను రక్షించారు. ఆ తర్వాత ఆమె ఈ అంశంపై క్షమాపణలు కూడా చెప్పింది. ఈ ఘటనకు చెందిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. రెస్టారెంట్‌లో ఆ మహిళ వణుకుతూ కూర్చుండిపోయింది.
అయితే మతగురువులు వచ్చి ఆ డ్రెస్సుపై ఉన్న అక్షరాలను డీకోడ్ చేశారు. ఆ డ్రెస్సుపై ఉన్నది అరబిక్ కాలీగ్రఫీ అని, అవి ఖురాన్ సూక్తులు కావన్నారు.