Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరింతమంది ఉద్యోగులను తొలగిస్తాం : సుందర్ పిచ్చాయ్

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (14:35 IST)
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత కారణంగా భవిష్యత్ కాలంలో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ సూచన ప్రాయంగా వెల్లడించారు. ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్.. మున్ముందు మరింత మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. 
 
తాజాగా కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కృత్రిమ మేథ ఆధారిత చాట్‌బాట్‌ బార్డ్‌, జీమెయిల్‌, గూగుల్‌ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు పిచాయ్‌ తెలిపారు. వీటిలో ఇంకా చాలా పనిచేయాల్సి ఉందన్నారు. వీటిలో ఉన్న అవకాశాలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
 
అందుకు అనుగుణంగానే తమ సిబ్బందిని అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుల్లోకి తరలిస్తున్నామన్నారు. కంపెనీలో జరుగుతున్న ప్రతి పనిని క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా ఖర్చులను పునఃసమీక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఫలితంగా కంపెనీ సామర్థ్యాన్ని మరో 20 శాతం పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ
 
కాగా, కంపెనీ ఉద్యోగుల్లో ఆరు శాతానికి సమానమైన 12,000 మందిని గూగుల్‌ జనవరిలో తొలగించింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. భారత్‌లో 450 మందిని ఇంటికి పంపారు. అయితే, ఫిబ్రవరిలో తొలగించిన ఈ 450 మంది 12,000 తొలగింపుల్లో భాగమా.. కాదా.. అనే విషయంపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments