ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో టెక్ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టాయి. ఫలితంగా పలు కంపెనీలు ఉద్యోగులను ఊడపీకుతున్నాయి.
ఫేస్‌బుక్ మాతృసంత్థ మెటా కూడా ఇందుకు అతీతం కాలేదు. ఇటీవలే 11 వేల మందిని తొలగించింది. తాజాగా ఆ సంస్థలో కొనసాగుతున్న మేనేజర్ల వ్యవస్థపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్.. వారిపై తొలగించేందు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
మేనేజర్లు, వారిని నియంత్రించేందుకు మరికొంతమంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్ చేసేందుకు ఇంకొంతమంది మేనేజర్లు.. ఇలా అన్ని స్థాయిల్లో మేనేజ్‌మెంట్ వ్యవస్థ అవసరం లేదని తాను అనుకోవడం లేదన జుకర్‌బర్క్ అభిప్రయాపడ్డారు. తాజాగా సంస్థ ఉద్యోగులతో నిర్వహించిన ఓ కీలక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే వారికి పింక్ స్లిప్‌లు ఖాయమనే ప్రచారం ఇంటర్నేషనల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.