Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జ్ ఫ్లాయిడ్‌ది ముమ్మాటికీ హత్యే : పోలీస్ ఆఫీసర్‌పై మర్డర్ కేసు

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:58 IST)
అమెరికాలో ఓ నల్ల జాతీయుడుని పోలీసు అధికారి ఒకరు ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేశాడు. దీంతో అతనిపై హత్య కేసు నమోదైంది. అలాగే, మరో ముగ్గురు పోలీసులపై కూడా వేటుపడింది. ఈ హత్య కేసు అమెరికాలోనే కాకుండా, సోషల్ మీడియాలో సైతం సంచలనం సృష్టించింది. 
 
అమెరికాలోని మిన్నియా పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఓ కేసులో పట్టుకున్నారు. ఆ తర్వాత 43 యేళ్ళ ఫ్లాయిడ్‌ను నేలపై పడేసి అతని గొంతుపై ఓ పోలీసు అధికారి తన మోకాలుతో నొక్కిపట్టాడు.
 
దీంతో ఫ్లాయిడ్‌కు ఊపిరి ఆడలేదు. తనకు ఊపిరాడటం లేదంటూ పలుమార్లు ప్రాధేయపడినా ఆ అధికారి వదిలిపెట్టలేదు. ఇదే అమయంలో ఫ్లాయిడ్‌కు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఫ్లాయిడ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించగా, న‌ల్ల‌జాతీయుడికి గుండెపోటు వ‌చ్చిన‌ట్లు హెన్నెపిన్ కౌంటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ త‌న‌ పోస్టుమార్ట‌మ్‌లో పేర్కొన్నారు. మెడ‌ను వ‌త్తిపెట్ట‌డం వ‌ల్ల ఫ్లాయిడ్ మ‌ర‌ణించిన‌ట్లు పోస్టుమార్ట‌మ్‌లో తేల్చారు.
 
ఈ కేసులు పోలీసు ఆఫీస‌ర్ డెరెక్ చౌవిన్‌పై హ‌త్య కేసు న‌మోదు అయ్యింది. వ‌చ్చే వారం అత‌న్ని కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఇదే ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. 
 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments