Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మృతదేహాలపై కరోనా వైరస్ ఎంతకాలం జీవించివుంటుంది?

మృతదేహాలపై కరోనా వైరస్ ఎంతకాలం జీవించివుంటుంది?
, గురువారం, 28 మే 2020 (22:48 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిబారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి వారికి అంత్యక్రియలు నిర్వహించడం కూడా సాధ్యపడటం లేదు. దీంతో ఎంతో లగ్జరీగా జీవించిన కోటీశ్వరులు కూడా కరోనా వైరస్ సోకి చనిపోతే అనాథలుగా ఖననం చేస్తున్నారు. చివరకు కన్నవారు, తోబుట్టువులు, భార్యాపిల్లలు కూడా కడసారి చూపుకు నోచుకోవడం లేదు. 
 
అయితే, మృతదేహాలపై కరోనా వైరస్ ఎంతకాలం జీవించివుంటుందన్న అంశంపై ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ గురువా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పైగా, కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారి అంత్యక్రియల సమయంలో పాటించాల్సి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్పారు. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు మృతదేహాలపై కరోనా వైరస్ ఎంతకాలం జీవిస్తుందో స్పష్టంగా పేర్కొనకపోయినప్పటికీ... మృతుల బంధువులు మాత్రం మృతదేహాన్ని మాత్రం తాకకుండా, దూరంగా ఉండి చూడొచ్చని తెలిపారు. అయితే, అంత్యక్రియల సమయంలో ఖచ్చితంగా తగిన జాగ్రత్తలతో పాటు.. రక్షణ కవచాన్ని ధరించాలని సూచించారు. 
 
అయితే, ఈగల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు. నిజానికి మృతదేహాల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతున్న అంశంపై స్పష్టమైన సమాచారం లేదన్నారు. కానీ, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. అత్యంత ముఖ్యంగా, కరోనా వైరస్‌తో చనిపోయినవారికి మాత్రం వైద్యులు శవపరీక్ష చేయరాదని ఆయన స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ రాష్ట్ర చీఫ్ కన్నా కోడలు అనుమానాస్పద మృతి?!