Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 20మంది మృతి

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:55 IST)
Landslides
కరోనా ఓ వైపు భారీ వర్షాలు జనాలను భయపెడుతున్నాయి. అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్ బలపడింది. దీని ప్రభావం వల్ల గుజరాత్‌, మహారాష్ట్ర తీరాల వద్ద వర్షం కురుస్తోంది. వల్సాద్‌తో పాటు ముంబై తీర ప్రాంతాల్లోనూ జల్లులు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రానికి నిసర్గ తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
తాజాగా అస్సాం రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. దక్షిణ అస్సాంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. 
 
బరాక్ వ్యాలీ ప్రాంతంలో ఉన్న పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి అస్సాంలో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. కచార్ జిల్లాలో ఏడు మంది, హైలకండి జిల్లాలో ఏడు మంది, కరీంగంజ్ జిల్లాలో ఆరు మంది మృతి చెందారు.
 
ఈశాన్య రాష్ట్రం ఇప్పటికే భారీ వరదలతో పోరాడుతోంది. వరదల కారణంగా సుమారు 3.72 లక్షల మంది ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. దీని ప్రభావంతో గోల్పారా జిల్లా అత్యధికంగా దెబ్బతింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments