Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొన్న ప్రధాని.. డ్రగ్స్ పరీక్ష

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (11:11 IST)
ఫిన్లాండ్ ప్రధాని సనా మారిన్ చిక్కుల్లో పడ్డారు. తన స్నేహితురాళ్లతో కలిసి ఆమె మద్యం పార్టీలో పాల్గొన్నారు. ఇందులో దేశ ప్రధాని అనే విషయాన్ని మరిచిపోయి స్నేహితురాళ్లతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అదేసమయంలో ఈ పార్టీలో ప్రధాని సనా మారిన్ డ్రగ్స్ తీసుకున్నారంటూ విపక్ష పార్టీల నేతల ఆరోపించారు. వీరికి గట్టిగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్న ప్రధాని స్వయంగా ముందుకు వచ్చిన డ్రగ్స్ పరీక్ష చేయించుకున్నారు. ఈ ఫలితాలు మరో వారం రోజుల్లో రానున్నాయి. 
 
కాగా, ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానిగా గుర్తింపు పొందిన 36 ఏళ్ల సనా మారిన్ శనివారం రాత్రి ఫిన్లాండ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, ఆర్టిస్టులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆమె స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ కనిపించారు. 
 
గతంలో కూడా ఆమె పలు మ్యూజిక్‌ ఈవెంట్లకు హాజరై విమర్శలు ఎదుర్కొన్నారు. తాజా వీడియో బయటకు రాగానే ప్రతిపక్షాలు ఆమెపై ఆరోపణలు గుప్పించాయి. పార్టీలో డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని, అందుకే ఆమె అంతలా పార్టీలో చిందేశారని అనుమానం వ్యక్తం చేశాయి. తనపై వస్తున్న ఆరోపణలను మారిన్ ఖండిచారు. తాను ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకోలేదని, ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నట్టు ప్రకటించారు. 
 
'ఈ మధ్య నేను డ్రగ్స్ ఉపయోగించిన ప్రాంతాల్లో ఉన్నానని, లేదా నేను నేనే డ్రగ్స్ వాడానని ఆరోపణలు వస్తున్నాయి. వీటిని నేను చాలా తీవ్రమైనవిగా భావిస్తున్నా. డ్రగ్ టెస్టు చేయించుకోవాలని డిమాండ్ చేయడం అన్యాయంగా భావిస్తున్నప్పటికీ, అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నేను ఈ రోజు డ్రగ్ టెస్ట్ చేయించుకున్నా. దాని ఫలితాలు ఒక వారంలో వస్తాయి' అని సనా పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments