Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (23:39 IST)
పాకిస్థాన్‌కు యుద్ధ భయం పట్టుకుంది. దీంతో పాక్ లాగు తడిసిపోతోంది. భారత్ ఏ క్షణంలో దాడి చేస్తుందోనన్న భయం వెంటాడుతోంది. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో తిష్టవేసివున్న ఉగ్రవాదులను చడీ చప్పుడు లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇటీవల కాశ్మీర్ లోయలోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడికి భారత్ ప్రతిదాడికి ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో పీవోకేలో ఏ క్షణమైనా యుద్ధ ఘంటికలు మోగే అవకాశం ఉంది. దీంతో పీవోకేలోని ఉగ్రవాద లాంఛ్ ప్యాడ్‌లను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం మొదలుపెట్టింది. ఈ మేరకు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 
 
పీవోకేలో భారత భద్రతా సంస్థలు క్రియాశీలకంగా ఉన్న పలు లాంచ్ ప్యాడ్‌లను గుర్తించిన నేపథ్యంలో పాక్ ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. పీవోకేలోని కెల్, సర్ది, దుద్నియల్, అత్ముఖం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కొట్లి వంటి పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరలిస్తున్నట్టు నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. 
 
ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోకి ప్రవేశించకముందు వారు నివసించే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్‌ప్యాడ్స్ పనిచేస్తాయి. వీరిలో 150 నుంచి 200 మందిక శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments