Pahalgam terror attack పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అమాయక పర్యాటకులపై నీచమైన దాడి చేసి ఉగ్రవాదుల హతమార్చడాన్ని భారతదేశం తీవ్రంగా పరిగణిస్తోంది. పాకిస్తాన్ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో యుద్ధం జరుగుతుందన్న ఆందోళనతో పాకిస్తాన్ దేశానికి చెందిన వేలమంది సైనికులు వందలమంది అధికారులు తమతమ పదవులకు రాజీనామాలు సమర్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి వుండటంతో యుద్ధం వస్తే తమవారిని ఎక్కడ పోగొట్టుకోవలసి వస్తుందోనని పేరెంట్స్ రాజీనామా చేసి వెనక్కి వచ్చేయాలంటూ వత్తిడి తెస్తున్నారట. దీనితో ఇప్పటికే రాజీనామా లేఖలు సమర్పించిన వారి సంఖ్య దాదాపు 5,000 మించిపోయినట్లు చెబుతున్నారు. వీరి రాజీనామానాలను ఆమోదించకూడదని పాక్ ఆర్మీ హైకమాండ్ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.