Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావుకు చిహ్నమైన నంబరుకు వేలం పాటలో రూ.12.8 కోట్ల ధర

తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీఏ కార్యాలయ ఉన్నతాధికారులు ఫ్యాన్సీ నంబర్లను వేలం వేస్తుంటారు. దీంతో ఈ తరహా నంబర్లకు భారీ ధర పలుకుతుంది.

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (12:27 IST)
తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆర్టీఏ కార్యాలయ ఉన్నతాధికారులు ఫ్యాన్సీ నంబర్లను వేలం వేస్తుంటారు. దీంతో ఈ తరహా నంబర్లకు భారీ ధర పలుకుతుంది. హైదరాబాద్‌లో జరిగే వేలం పాటల్లో ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడంతో టాలీవుడ్ హీరోలు అమితాసక్తిని చూపుతుంటారు. ఇదే కోవలో ఓ ఆస్ట్రేలియా వాసి తనకు నచ్చిన ఫ్యాన్సీ నంబరును ఏకంగా రూ.12.8 కోట్లు చెల్లించి దక్కించుకున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఆస్ట్రేలియాలోని సిడ్నీ రవాణాశాఖ కార్యాలయం ఇటీవల పలు నెంబర్లకు వేలం నిర్వహించింది. ఈ వేలంలో ‘ఎన్‌ఎస్‌డబ్ల్యూ 4’ నంబర్‌ ప్లేటు అక్షరాలా 2.45 మిలియన్‌ డాలర్ల (12.8 కోట్ల రూపాయల)కు అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తొలుత ఈ నెంబర్‌కు 1.5 మిలియన్ల ధర పలికే అవకాశం ఉందని భావించగా, ఊహించని ధరకు పీటర్ సెంగ్ అనే చైనా సంతతి బిలియనీర్ దక్కించుకున్నాడు. 
 
వాస్తవానికి చైనీయులు 4 నెంబర్‌ను అశుభంగా, మరణానికి చిహ్నంగా భావిస్తారు. ఎరుపు రంగు ఫెరారీపై వేలానికి వచ్చిన ఆయన ఈ నెంబర్‌ను రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేశారు. కాగా, ఆయన వద్ద హాంకాంగ్ రిజిస్ట్రేషన్‌తో నెంబర్ 1 ప్లేటు ఉండటం విశేషం. 
 
ఈ రవాణా కార్యాలయంలో ఇంతవరకు 2003లో నిర్వహించిన వేలంలో ‘నంబర్‌ 2’ ప్లేటు పలికిన 6.8 మిలియన్ ఆసీస్‌ డాలర్ల ధరే అత్యధికం. దీంతో రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోవడం అంటే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆర్టీఏ కార్యాలయ అధికారులు రుచిచూశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments