కన్యత్వం ఫర్ సేల్ : శీలాన్ని రూ.17 కోట్లు అమ్ముకున్న యువతి... ఎందుకంటే?
ఆడపిల్లలకు శీలానికి మంచింది మరొకటి లేదు. కానీ, ఆ యువతికి మాత్రం అది అంగట్లోని సరకులా కనిపించింది. అందుకే తన శీలాన్ని వేలం పాటలో అడ్డంగా అమ్మేసింది. అదీ కూడా రూ.కోట్లకు. రుమేనియా దేశంలో వెలుగులోకి వచ్చ
ఆడపిల్లలకు శీలానికి మంచింది మరొకటి లేదు. కానీ, ఆ యువతికి మాత్రం అది అంగట్లోని సరకులా కనిపించింది. అందుకే తన శీలాన్ని వేలం పాటలో అడ్డంగా అమ్మేసింది. అదీ కూడా రూ.కోట్లకు. రుమేనియా దేశంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
రొమేనియాకు చెందిన అలెగ్జాండ్రా కెఫ్రెన్ అనే 18 యేళ్ళ యువతికి ఓ ఐడియా వచ్చింది. జీవితాంతం కలిసి ఉంటాడో ఉండడో తెలియని వ్యక్తికి కన్యత్వాన్ని అప్పగించే కంటే తన విద్యకు అవసరమైన ఫీజులు చెల్లించేందుకు అమ్ముకోవడంలో తప్పులేదని భావించింది. అనుకున్నదే తడవుగా తన కన్యత్వాన్ని వేలం వేయాలనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. అయితే, దీనిపై పెను దుమారమే చెలరేగింది.
అయినప్పటికీ.. ఆ యువతి ఏమాత్రం జంకలేదు.. వెనక్కి తగ్గలేదు. పైగా, తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటున్నానని, అందుకు విద్య చాలా అవసరమని, తన విద్యకు అవసరమయ్యే డబ్బు కోసం తన కన్యత్వాన్ని వేలం వేస్తున్నట్టు కౌంటర్ ఇచ్చింది. భవిష్యత్తులో ఎవరికైనా తన కన్యత్వాన్ని సమర్పించాల్సిందేనని, ఆ తర్వాత అతడు తనతో శాశ్వతంగా ఉంటాడన్న గ్యారెంటీ కూడా లేదని తెలిపింది.
దీంతో జర్మనీకి చెందిన ఎస్కార్ట్ సంస్థతో బేరం కుదుర్చుకుని తన కన్యత్వాన్ని మిలియన్ యూరోల ప్రారంభ ధరతో వేలానికి పెట్టింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యాపారవేత్త ఆమె కన్యత్వాన్ని 2.5 మిలియన్ యూరోలకు వేలం పాడుకున్నాడు. ఇందులో 20 శాతం జర్మనీకి చెందిన సిండ్రెల్లా ఎస్కార్ట్ సంస్థ ఒప్పందం ప్రకారం తీసుకుంటుంది.