ఏం సిద్ధా.. నువ్వు మరో బొజ్జలలాగా ఉన్నావే...!
తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో అటవీశాఖ అంటేనే భయపడిపోతున్నారు మంత్రులు. కారణం ఇప్పటికే బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మంత్రి పదవి పోవడానికి ఈ శాఖే కారణం. ఎంత కష్టపడి పనిచేసినా ఆ శాఖకు బొజ్జల న్యాయం చేయ
తెలుగుదేశం పార్టీ మంత్రివర్గంలో అటవీశాఖ అంటేనే భయపడిపోతున్నారు మంత్రులు. కారణం ఇప్పటికే బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మంత్రి పదవి పోవడానికి ఈ శాఖే కారణం. ఎంత కష్టపడి పనిచేసినా ఆ శాఖకు బొజ్జల న్యాయం చేయలేకపోయారన్నది బాబు భావన. అందుకే నిర్దాక్షణ్యంగా ఆ శాఖ నుంచి తీసేశారు బొజ్జలను. కొత్త కేబినెట్‌లో ఆశాఖను సిద్ధారాఘవయ్యకు ఇచ్చారు. ఈయన గతంలో ఆర్టీసీ మంత్రిగా పనిచేశారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువస్తారని అనుకున్నారు. కానీ పోను పోను నష్టాలే పెరిగిపోయాయి. సిద్ధారాఘవయ్యను మంత్రి పదవి నుంచి తీసేస్తారని ముందుగా అందరూ అనుకున్నారు. కానీ ఆయన్ను తీయకుండా కీలకశాఖను అప్పగించారు.
అయితే ఆ శాఖపై కూడా సిద్ధా పెద్దగా పట్టులేనట్లు అర్థమవుతోంది బాబు. ఇప్పటికే కోట్ల రూపాయలు విలువచేసే ఎర్రచందనం గోడౌన్లలో మూలుగుతుంటే ఇప్పటివరకు వాటిని విక్రయించలేదు. అటవీశాఖామంత్రిగా సిద్ధా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక దృష్టి సారించాలని సిద్ధాను ఆదేశించారు బాబు. అయితే ఇప్పటివరకు తిరుపతి వైపు ఒక్కసారి కూడా తొంగిచూడలేదు మంత్రి. అసలు ఎన్ని టన్నుల ఎర్రచందనం ఉందో కూడా ఆయనకు తెలియదు. దీంతో చంద్రబాబు మంగళవారం విజయవాడలో జరిగిన మంత్రుల సమావేశంలో సిద్ధాకు ఫుల్ క్లాస్ ఇచ్చారట.
సిద్ధా ఏంటిది.. ఎర్రచందనాన్ని ఎందుకు అమ్మలేకపోతున్నారు. తిరుపతికి వెళ్ళావా.. అంటూ బాబు ప్రశ్నించారట. దీంతో ఏం చెప్పాలో తెలియక మంత్రి నీళ్ళు నమిలారు. నిల్వ ఉన్న ఎర్రచందనాన్ని విక్రయిస్తే కోట్ల రూపాయలు డబ్బులు వస్తుందనేది బాబు ఉద్దేశం. ఆ డబ్బు కాస్త లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీకి ఉపయోగపడుతుందనేది ఆయన భావన. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని అమ్మాలని భావిస్తున్నారు. కానీ, మంత్రి చొరవ చూపించలేక పోతున్నారు.