Webdunia - Bharat's app for daily news and videos

Install App

పప్పీ.. ఎలుగుబంటిగా మారింది.. రోజుకు 2 బకెట్ల న్యూడిల్స్ తినేది..

పప్పీ అనుకుని ఓ ఎలుగుబంటిని పెంచుకుంది ఓ మహిళ. అంతే అది ఎలుగబంటి అని తెలుసుకుని షాకైంది. ఈ ఘటన చైనాలోని యునాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్న పప్పీ డాగ్‌ను రెండేళ్ల క్రితం ఇంటికి తెచ్చుక

Webdunia
బుధవారం, 16 మే 2018 (12:18 IST)
పప్పీ అనుకుని ఓ ఎలుగుబంటిని పెంచుకుంది ఓ మహిళ. అంతే అది ఎలుగబంటి అని తెలుసుకుని షాకైంది. ఈ ఘటన చైనాలోని యునాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిన్న పప్పీ డాగ్‌ను రెండేళ్ల క్రితం ఇంటికి తెచ్చుకుంది చైనా మహిళ. ఓ నల్లని జంతువును శునకంగా భావించి ఇంటికి తెచ్చుకున్న ఆమెకు రెండేళ్ల తర్వాత అది పప్పీ కాదని ఎలుగుబంటి అని తెలిసింది. 
 
అంతే.. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చింది. శునకం అనుకుని ఇంటికి తెచ్చుకుంటే అది 200 కేజీల బరువు పెరిగిందని.. అది ఎలుగుబంటి అని తెలుసుకున్నాక జడుసుకుని భయంతో.. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చానని వెల్లడించింది.  
 
ఇక అటవీ శాఖాధికారులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని ఆ ఎలుగుబంటిని బోనులో బందించారు. ఆ ఎలుగుబంటి చాలా ప్రమాదకరమైందని తెలిపారు. ఆ ఎలుగుబంటి రోజుకు రెండు బకెట్ల న్యూడిల్స్ తినేదని.. దానికి లిటిల్ బ్లాక్ అని పేరు పెట్టుకుని పెంచుకున్నానని.. కానీ ఎలుగుబంటి అని తెలిశాక భయపడ్డానని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments