Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం: అణుపరీక్షల కేంద్రాల్ని పేల్చేస్తారట!

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలు నిలిపివేయనున్నట్లు గత నెలలోనే ప్రకటించిన కిమ్.. తాజాగా అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

Advertiesment
North Korea
, ఆదివారం, 13 మే 2018 (12:11 IST)
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణు పరీక్షలు నిలిపివేయనున్నట్లు గత నెలలోనే ప్రకటించిన కిమ్.. తాజాగా అణ్వాయుధ పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలనే నిర్ణయానికి వచ్చారు. మే 23-25 తేదిల్లో అమెరికాతో చర్చలు జరిగే అవకాశం ఉండటంతో అంతకుముందే అణు పరీక్షల కేంద్రాన్ని పేల్చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 
 
పేలుడు పదార్థాలతో పుంగే-రి అణుపరీక్షల కేంద్రాన్ని పేల్చి వేయనున్నట్టు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. గతేడాది సుదీర్ఘ అణు పరీక్షలతో ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేసిన కిమ్, షాక్ ఇచ్చే ప్రకటన చేశారు.
 
పరిశోధన భవనాలు, సెక్యూరిటీ పోస్టులు, టన్నెల్స్, న్యూక్లియర్ వెపన్ ఇన్సిస్టిట్యూట్.. ఇతర సంస్థలతో పాటు అన్నింటినీ ధ్వంసం చేయనున్నట్లు తెలిపింది. అణుపరీక్షలకు చరమగీతం పాడినట్టు ప్రకటించిన నేపథ్యంలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కాగా మరో మూడువారాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సింగపూర్‌తో కిమ్ భేటీ కానున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకుమారుడి పెళ్లి.. గిఫ్ట్ ఐటమ్స్‌ను దోచేశారు..