Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో కిమ్ జాంగ్ పర్యటన: 2011లో తండ్రి జర్నీ చేసిన అదే తరహా రైలులోనే?

ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ తొలిసారి దేశం వీడుతున్నారు. తొలిసారి విదేశీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అణు పరీక్షలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న కిమ్ జాంగ్.. 2011లో అధికార

Advertiesment
చైనాలో కిమ్ జాంగ్ పర్యటన: 2011లో తండ్రి జర్నీ చేసిన అదే తరహా రైలులోనే?
, మంగళవారం, 27 మార్చి 2018 (09:11 IST)
ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ తొలిసారి దేశం వీడుతున్నారు. తొలిసారి విదేశీ పర్యటనకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అణు పరీక్షలతో ప్రపంచ దేశాలను వణికిస్తున్న కిమ్ జాంగ్.. 2011లో అధికారంలోకి వచ్చాక.. తొలిసారిగా విదేశీ పర్యటనకు పర్యటించే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడేళ్లయినా ఇప్పటి వరకు దేశం దాటి బయటకు అడుగుపెట్టలేదు. 
 
చైనాలో కిమ్ జాంగ్ పర్యటన వుంటుందని సమాచారం. అయితే చైనాలో కిమ్ జాంగ్ ఎన్నిరోజులు పర్యటిస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. చైనాలో కిమ్ జాంగ్ ఎవరిని కలవబోతున్నారనేది ఇంకా తెలియరాలేదు. కిమ్ జాంగ్ ఓ ప్రత్యేక రైలు ద్వారా ఉత్తర సరిహద్దు పట్టణమైన డాన్‌డోంగ్ మీదుగా చైనాలోకి అడుగుపెడతారని తెలుస్తోంది. 
 
ఇంకా కిమ్ జాంగ్ తండ్రి ఉపయోగించిన రైలు వంటిదే సోమవారం ఓ రైలు బీజింగ్‌కు చేరుకుంది. 2011లో తన మరణానికి ముందు కిమ్ జాంగ్ 11 ఇలాంటి రైలులోనే చైనాను సందర్శించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్‌ను కలిసేందుకు అంగీకరించిన కొన్నివారాల్లోనే కిమ్ చైనాలో పర్యటించాలనే నిర్ణయం తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయన 'ఆల్‌ ది బెస్ట్' చెప్పారట.. అయితే, జనసేనలోకి వస్తారా?