ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

ఠాగూర్
సోమవారం, 17 నవంబరు 2025 (15:19 IST)
బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధిస్తూ ఇంటర్నేషనర్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై అనేక కేసులు నమోదైవున్నాయి. 
 
ఈ కేసుల్లో వాదనలు ఆలకించిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సోమవారం ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జులై - ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
 
ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. ఈ మేరకు దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు. 
 
గాయపడినవారికి వైద్యం అందించేందుకు నిరాకరించారన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. 
 
కాగా, ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా ముఖ్యంగా రాజధాని నగరం ఢాకాలో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే.. వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments