Webdunia - Bharat's app for daily news and videos

Install App

400 బిలియన్ డాలర్ల క్లబ్‌లో ఎలాన్ మస్క్!!

ఠాగూర్
గురువారం, 12 డిశెంబరు 2024 (13:58 IST)
స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ 400 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. వ్యక్తిగత ఆదాయ సంపాదంలో ఆయన సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు. తాజాగా స్పేస్ ఎక్స్‌లోని అంతర్గత వాటా విక్రయంతో ఆయన సంపాదన దాదాపు 50 బిలియన్ డాలర్లు పెరిగి 439.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది.
 
2022 చివరలో మస్క్ సంపాదన నికర విలువ 200 బిలియన్ డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. అయితే, ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత మస్క్ సంపాదనకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ట్రంప్ విజయం అనంతరం టెస్లా స్టాక్స్ దాదాపు 65 శాతం పెరిగాయి.
 
దీంతో మస్క్ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి అత్యధిక విరాళాలు ఇచ్చిన మస్క్.. ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దాంతో ట్రంప్ తన మంత్రివర్గంలో మస్క్‌కు కీలక పదవి కూడా ఇచ్చారు.
 
అలాగే ట్రంప్ విజయంతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను క్రమబద్ధీకరిస్తారని, టెస్లా పోటీదారులకు మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలపై టాక్స్ క్రెడిట్‌లను ఆయన తొలగిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టెస్లా స్టాక్స్ విపరీతంగా పెరుగుతున్నాయి.
 
ఇదిలావుంటే.. మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ స్టార్టప్ ఎక్స్ ఏఐ గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో దాని విలువ రెండింతలై 50 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక బుధవారం స్పేస్ ఎక్స్, దాని పెట్టుబడిదారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా 1.25 బిలియన్ డాలర్ల విలువ గల షేర్లను స్పేస్ ఎక్స్ ఉద్యోగులు, కంపెనీ ఇన్ సైడర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది.
 
దీంతో స్పేస్ ఎక్స్ 350 బిలియన్ డాలర్ల విలువకు చేరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్ స్టార్టప్‌గా స్పేస్ ఎక్స్ రికార్డు సృష్టించింది. ఇక స్పేస్ ఎక్స్ ఆదాయంలో ఎక్కువ శాతం అమెరికా ప్రభుత్వం ఒప్పందాల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ట్రంప్ పదవీకాలంలో కంపెనీకి భారీ మద్దతు లభించే
అవకాశం ఉంది.
 
ఇక ఎన్నికల ప్రచారం సమయంలో అంగారక గ్రహంపైకి వ్యోమగాములను పంపించే మస్క్ ప్రతిపాదనకు ట్రంప్ మద్దతు ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత టెక్సాస్‌లో జరిగిన స్పేస్ఎక్స్ లాంచ్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఎలాన్ మస్క్‌తో కలిసి పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments