Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డోనాల్డ్ ట్రంప్ కొలువులో ఎలాన్ మస్క్‌... వివేక్ రామస్వామితో కలిసి విధులు..

musk - trump

ఠాగూర్

, బుధవారం, 13 నవంబరు 2024 (09:33 IST)
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయభేరీ మోగించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు అండగా నిలిబడిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ఇపుడు ట్రంప్ సర్కారులో కీలక పదవిని చేపట్టనున్నారు. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు.
 
'అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు. 'సేవ్ అమెరికా' ఉద్యమానికి ముఖ్యమైన ఉద్యోగులపై అదనపు నిబంధనల భారం సడలింపు, వృథా వ్యయాల తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి మార్పులు చేపడతారు' అని ట్రంప్ వెల్లడించారు.
 
కాగా గతవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్‌పై రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డారు. భారీగా విరాళాలు అందించడమే కాకుండా ట్రంప్‌తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. 
 
ఫలితాలు వెలువడిన తర్వాత 'విక్టరీ స్పీచ్'లో ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతమైన వ్యక్తి, మేధావి అని అభివర్ణించారు. 'మనకో కొత్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రమే ఎలాన్ మస్క్' అని అన్నారు. రెండు వారాలపాటు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. తనతో కలిసి ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారని గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో అత్యంత శక్తిమంతుడైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు : ఇండియా టుడే సర్వే