చైనా సరిహద్దును సునాయాసంగా ఏనుగును దాటేసింది. దేశ సరిహద్దులు దాటడం అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది.. చైనా సరిహద్దును అలవోకగా లావోస్‌లోకి అడుగుపెట్టి దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింద
చైనా సరిహద్దును సునాయాసంగా ఏనుగును దాటేసింది. దేశ సరిహద్దులు దాటడం అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది.. చైనా సరిహద్దును అలవోకగా లావోస్‌లోకి అడుగుపెట్టి దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
వివరాల్లోకి వెళితే.. శనివారం చైనాలోని యునాన్ ప్రావిన్స్‌కు లావోస్‌కు మధ్య ఉన్న సరిహద్దును ఓ ఏనుగు దాటింది. ఆ సమయంలో అధికారులు చూసినప్పటికీ ఏం చేయలేకపోయారు. ఏనుగు వస్తుందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు మాత్రమే చేశారు.
ఇక సరిహద్దు దాటిన ఏనుగు రెండు గంటలపాటు లావోస్ భూభాగంలో తిరిగింది. తిరిగి తన దేశం భూసరిహద్దులోకి వచ్చేందుకు అదే బోర్డర్ గేటు నుంచి వెనక్కి వచ్చింది. దీన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు జాగింగ్ కోసం లావోస్ వెళ్లి వుంటుందని.. జోకులు పేలుస్తున్నారు.