Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో నాలుగేళ్ళు నాకు ఛాన్సివ్వండి... డోనాల్డ్ ట్రంప్

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (12:30 IST)
కరోనా వైరస్ బారినపడి తిరిగి కోలుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తిరిగి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వందలాది మంది మద్దతుదారులు కేరింతలు పెడుతుండగా, వైట్‌హౌస్ వేదికగా, ముఖానికి ధరించిన కరోనా మాస్క్‌ను తొలగించి మరీ ప్రసంగించారు. 
 
'నేనిప్పుడు చాలా బాగున్నాను' అని వైట్‌హౌస్ బాల్కనీ నుంచి ట్రంప్ ప్రసంగించారు. అంతేకాకుండా, 'మరోసారి అమెరికాను గొప్పగా నిలబెట్టేందుకు సిద్ధంగావున్నాను. మరొక్క నాలుగేళ్లు నాకు అవకాశం ఇవ్వండి' అని తన 20 నిమిషాల ప్రసంగంలో ఆయన ఓటర్లను కోరారు. కాగా, ప్రస్తుతం ఉన్న సర్వే వివరాల ప్రకారం, 77 సంవత్సరాల డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కన్నా ట్రంప్ వెనుకంజలో ఉన్నారన్నారు. 
 
మరోవైపు, శనివారం ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన వైట్‌హౌస్ డాక్టర్, ట్రంప్‌కు ఇక పూర్తిగా నయమైనట్టేనని, ఆయన్నుంచి వైరస్ వ్యాపిస్తుందన్న ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆయన శరీరంలో యాక్టివ్ వైరస్ సృష్టించబడుతున్నట్టు ఆధారాలు లేవని పరీక్షల తర్వాత నిపుణులు నిర్ధారించినట్టు ప్రకటన వెలువడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

మరీ స్లిమ్‌గా సమంత, రూ. 500 కోట్ల ప్రాజెక్టు కోసమే అలా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments