Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్... డెమొక్రాట్ల సంబరాలు చూస్తు శ్వేతసౌథంలోకి...

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2020 (09:04 IST)
అమెరికా దేశానికి కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోయారు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శ్వేతసౌథం నుంచి తట్టాబుట్టా సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరిజోనా రాష్ట్రంలో జో బైడెన్‌కు విజయకేతనం ఎగురవేసినట్టు ప్రకటించారో.. అపుడే డోనాల్డ్ ట్రంప్ ఓటమి ఖరారైపోయింది. దీంతో శనివారం నాడు ట్రంప్.. గోల్ఫ్ క్లబ్‌లో సేదతీరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సాయంత్రానికి బైడెన్ చేతిలో తాను ఓడిపోయినట్టు తెలుసుకున్న ట్రంప్... శ్వేతసౌథానికి బయలుదేరారు.
 
అయితే, అప్పటికే వైట్‌హౌస్ ఎదురుగా ఉన్న బ్లాక్ లివ్స్ మాటర్ ప్లాజా వద్దకు డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుని తమ నేత బైడెన్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక అదే రూట్లో వైట్ హౌస్‌కు వస్తున్న ట్రంప్, వారిని చూస్తూనే లోనికి ప్రవేశించాల్సి వచ్చింది.
 
కాగా, ఈ ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలయ్యారని అన్ని న్యూస్ ఏజన్సీలూ తేల్చి చెప్పగా, ఇంతవరకూ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఎవరికి ఎన్ని ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయన్న విషయాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించాల్సి వుంది. అయితే ఎన్నికల్లో బైడెన్ గెలిచేశారని కౌంటింగ్‌ను పరిశీలిస్తున్న వారంతా తేల్చి చెప్పేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments