Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా, రష్యా, భారత్‌లు మురికి దేశాలు.. నోరు జారిన డొనాల్డ్ ట్రంప్

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (20:08 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విమర్శలు గుప్పించారు. తాజాగా ట్రంప్ అదంతా తూచ్ అన్నట్టు భారత్ మీద నోటి దూల ప్రదర్శించారు. అప్పుడప్పుడు భారత్‌పై నోరుపారేసుకునే ట్రంప్ ఈసారి కాస్త శృతిమించారు. 
 
భారత్‌ను మురికి దేశంగా అభివర్ణించిన ఆయన.. భారత్‌లో స్వచ్ఛమైన గాలి లేదని అన్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య మూడో డిబేట్‌లో మాట్లాడారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు పర్యావరణ మార్పులపై చర్చించారు. 
 
ఈ సందర్భంగా ట్రంప్.. భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. పర్యావరణాన్ని భారత్ కలుషితం చేస్తోందని ఆరోపించారు. భారత్, చైనా, రష్యా దేశాలు కాలుష్య కారకాలను విపరీతంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని.. దీంతో పర్యావరణం కలుషితం అవుతోందని ట్రంప్ విమర్శించారు.
 
చైనా, రష్యా, భారత్‌లను చూస్తే ఎంత మురికిగా ఉంటాయో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఆ మూడు దేశాల్లో గాలి కూడా మురికిగా ఉంటుందని ఆరోపించారు. కాగా.. భారత్‌పై ట్రంప్ చేసిన విమర్శలపై భారతీయులు భగ్గుమంటున్నారు. ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments