ధృవ్ పటేల్‌కు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటం

ఠాగూర్
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (10:00 IST)
తాజాగా న్యూజెర్సీలో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీలు జరిగాయి. ఇందులో ఈ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటాన్ని ధ్రువీ పటేల్ దక్కించుకున్నారు. ఈమె అమెరికాకు చెందిన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి. ఈ పోటీల్లో విజేతగా అవతరించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. అలాగే తాను బాలీవుడ్ నటి అవ్వాలని, ఇంకా యూనిసెఫ్ అంబాసిడర్ కావాలని ఆకాంక్షించారు. 
 
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో కిరీటం బహుకరణ తర్వాత ధ్రువీ మాట్లాడుతూ... 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్‌ని అందుకోవడాన్ని అపురూప గౌరవంగా భావిస్తున్నాను. కిరీటం కన్నా ఇది ఎక్కువ. ఇది నా విలువను, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే అవకాశాన్ని అందించింది' అని ఆమె అన్నారు. ఇక ఇదే పోటీల్లో సురినా‌మ్‌కు చెందిన లిసా అబ్లోయెల్క్ ఫస్ట్ రన్నరప్, నెదర్లాండ్స్‌కు చెందిన మాళవిక శర్మ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. 
 
అలాగే మిసెస్ కెటగిరీలో ట్రినిడాడ్‌కు చెందిన సుఅన్ మౌటెట్ విజేతగా నిలిచారు. స్నేహ నంబియార్ ప్రథమ, యూకేకు చెందిన పవన్ దీప్ కౌర్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. టీన్ కేటగిరీలో గ్వాడెలోప్‌కు చెందిన సియెర్రా సురెట్ మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. నెదర్లాండ్ నుంచి శ్రేయా సింగ్ ఫస్ట్ రన్నరప్‌గా, సురినామ్‌కు చెందిన శ్రద్ధా టెడ్జో రెండో రన్నరప్‌గా నిలిచారు. ఈ అందాల పోటీలను న్యూయార్క్‌కు ఇండియా ఫెస్టివల్ కమిటీ నిర్వహిస్తుంది. ఇండియన్ - అమెరికన్లు నీలం, ధర్మాత్మ శరణ్ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments