Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గర్భిణి స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం!

Advertiesment
pragnant woman

ఠాగూర్

, సోమవారం, 16 సెప్టెంబరు 2024 (15:18 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో దారుణం జరిగింది. ఐదు గర్భంతో ఉన్న స్నేహితురాలిపై ఆర్మీ జవాను ఒకరు అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ లైంగికదాడి కారణంగా ఆమెకు తీవ్ర రక్తస్రావంతో పాటు కడుపునొప్పి వచ్చింది. దీంతో ఆమె తల్లడిల్లిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
35 యేళ్ళ బాధితురాలు బ్యాంకు అధికారి భార్య. యేడాది క్రితం ఆమె ఎంహౌ కంటోన్మెంట్లో వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్లింది. ఆ సమయంలో ఆర్మీలో పనిచేసే లాన్స్ నాయక్‌ అనే జవానుతో పరిచయం ఏర్పడింది. 
 
ఆ తర్వాత అతడు తరచుగా ఆమె ఇంటికి వచ్చి వెళ్లసాగాడు. ఈ క్రమంలో ఆమె వాష్ రూమ్‌లో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా వీడియోలు తీశాడు. వాటిని చూపించి అమెను బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. శుక్రవారం రాత్రి మరోమారు ఆమెను బెదిరించి, ఇండోర్‌లోని ఓ హోటల్ గదికి పిలిపించి, అక్కడ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె ఐదు నెలలో గర్భిణి కావడంతో తీవ్ర రక్తస్రావంతో పాటు కడుపు నొప్పి రావడంతో తల్లడిల్లిపోయింది. 
 
లైంగికదాడి జరిగిన మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకయేడాది కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్టు ఆరోపించింది. అయితే, నిందితుడు వాదన మరోలా వుంది. తామిద్దరం ఒక యేడాది కాలంగా డేటింగ్‌లో ఉన్నట్టు చెప్పాడు. ఆమె గర్భిణి అయినప్పటికీ శారీరకంగా కలడంతో రక్తస్రావమైందని చెప్పాడు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గణేష నిమజ్జనం అంటే ఇలా జరగాలి.. వీడియో వైరల్