బలహీనపడిన వాయుగుండం - ఏపీలో వర్షాలు తగ్గుముఖం

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (15:02 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ బలహీనపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పడుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ప్రయాణిస్తూ సోమవారం బలహీనపడి, అల్పపీడనం స్థాయికి పడిపోతుందని తెలిపారు. 
 
అయితే, అల్పపీడనం బలహీనపడినప్పటికీ సోమ, మంగళవారాల్లో మాత్రం అక్కడక్కడ వర్షపు జుల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావం కారణంగా తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. 
 
పైగా, సముద్రంలో అలజడి పూర్తిగా తగ్గిపోలేదని అందువల్ల జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని వారు హెచ్చరించారు. అయితే, ఈ వాయుగుండం ప్రభావం ఏపీలో పెద్దగా కనిపించలేదని చెప్పొచ్చు. ఒక్క పాలకోడేరులో మాత్రం 14 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షపు జల్లులు పడ్డాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments