నడుము నొప్పి తగ్గాలని 8 బతికున్న కప్పలను మింగేసిన వృద్ధురాలు... తర్వాత?

ఠాగూర్
గురువారం, 9 అక్టోబరు 2025 (08:41 IST)
నడుము నొప్పితో బాధపడుతున్న ఓ వృద్ధురాలు చేసిన పనికి ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఎవరో చెప్పిన మాఢనమ్మకాన్ని విశ్వసించి ఏకంగా ఎనిమిది బతికున్న కప్పలను మింగేసి చివరకు ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఈ వింత ఘటన చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
 
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం... 82 ఏళ్ల జాంగ్ అనే మహిళ చాలాకాలంగా హెర్నియేటెడ్ డిస్క్ సమస్యతో బాధపడుతోంది. తీవ్రమైన నడుము నొప్పితో ఆమె ఇబ్బంది పడుతుండగా, బతికున్న కప్పలను మింగితే నొప్పి మాయమవుతుందని ఎవరో ఆమెకు చెప్పారు. ఈ మాటలు గుడ్డిగా నమ్మిన ఆమె, కొన్ని చిన్న కప్పలను పట్టివ్వమని తన కుటుంబ సభ్యులను కోరింది. వారు తెచ్చివ్వగానే, వాటిని సజీవంగా మింగేసింది.
 
అయితే, నొప్పి తగ్గకపోగా ఆమె పరిస్థితి మరింత దిగజారింది. తీవ్రమైన కడుపునొప్పి రావడంతో నడవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హాంగ్ జౌలోని ఓ ఆసుపత్రికి తరలించారు. 'మా అమ్మ 8 బతికున్న కప్పలను మింగింది. ఇప్పుడు తీవ్రమైన నొప్పితో నడవలేకపోతోంది' అని ఆమె కుమారుడు వైద్యులకు వివరించాడు.
 
వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా, శరీరంలో ఆక్సిఫిల్ కణాల సంఖ్య అసాధారణంగా పెరిగినట్లు గుర్తించారు. పరాన్న జీవుల ఇన్ఫెక్షన్ లేదా రక్త సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని వారు తెలిపారు. మరిన్ని లోతైన పరీక్షల్లో ఆమె జీర్ణవ్యవస్థ దెబ్బతిన్నట్లు, స్పార్గానమ్ వంటి ప్రమాదకరమైన పరాన్నజీవులు ఆమె శరీరంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు.
 
'కప్పలను సజీవంగా మింగడం వల్ల పేషెంట్ జీర్ణవ్యవస్థ దెబ్బతింది. ప్రమాదకరమైన పరాన్నజీవులు ఆమె శరీరంలోకి చేరాయి' అని వైద్యులు తెలిపారు. అనంతరం రెండు వారాల పాటు చికిత్స అందించగా, ఆమె కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. శాస్త్రీయ ఆధారం లేని ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలతో చెలగాటమాడవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

K Ramp: కొందరు కావాలనే K-ర్యాంప్ మూవీపై పక్షపాతం చూపిస్తున్నారు : నిర్మాత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments