ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

ఠాగూర్
బుధవారం, 8 అక్టోబరు 2025 (23:48 IST)
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య మరోమారు యుద్ధం జరిగే అవకాశం ఉందని, ఆ యుద్ధంలో తామే గెలుస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ జోస్యం చెప్పారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తమకు అనుకూల ఫలితాలు ఉంటాయన్నారు. 
 
ఇరు దేశాల మధ్య ముప్పు పొంచివున్న మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే గతంలో కంటే మెరుగైన ఫలితాలు పాకిస్థాన్ సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. పాకిస్థాన్‌లో ప్రజలంతా ఒకరితో ఒకరు వాదించుకున్నా, విభేదాలు ఉన్నా భారత్‌తో యుద్ధం వస్తే మాత్రం ఐక్యంగా ఉంటామని ఆయన అన్నారు. చరిత్రను పరిశీలిస్తే భారత్ ఎపుడూ ఒక దేశంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. 
 
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ను భారత్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది గట్టిగా హెచ్చరించిన విషయం తెల్సిందే. భారత్ పూర్తి సన్నద్ధంగా ఉంది, ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే పాకిస్థాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేలా పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ పై విధంగా కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments