Webdunia - Bharat's app for daily news and videos

Install App

కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా .. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపు

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (12:44 IST)
చైనా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇందులోభాగంగానే ఇండోచైనా సరిహద్దులకు భారీ సంఖ్యలో బలగాలను తరలించింది. ఇప్పటికే 60 వేల బలగాలను తరలించినట్టు అమెరికా రక్షణ మంత్రి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైనిక బలగాలకు ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. 
 
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బుధవారం గ్వాంగ్డాంగ్ రక్షణ స్థావరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అక్కడి సైనికులకు పిలుపునిచ్చారు. దేశానికి విధేయంగా పని చేయాలని కోరారు. 
 
మీ పూర్తి శక్తిసామర్థ్యాలను యుద్ధంపైనే కేంద్రీకరించాలని, మీ మనసును సైతం యుద్ధం వైపే నడిపించాలన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జిన్‌పింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు విదేశీ మీడియాలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయి.
 
ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
ప్రస్తుతం పొరుగుదేశం భారత్‌తో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఆయన చేసిన భారత్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసివుంటారని అంతర్జాతీయ మీడియా ప్రముఖంగా కథనాలు ప్రసారం చేస్తోంది. ఇదేసమయంలో దక్షిణ చైనా సముద్రం విషయంలో పలు దేశాలతో కూడా చైనాకు విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా, తైవాన్‌తో ఆ దేశం నిత్యం ఘర్షణపడుతూనే వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments