Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కోరల్లో విషం.. ఆన్‌లైన్‌లో కొన్నాడు.. తొడపై కాటేసింది.. ఎక్కడ..?

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (19:24 IST)
పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన కాటు వేయక మానదు అని మన పెద్దలు అంటుంటారు. ఈ నానుడి నిజమేనని చైనాలో జరిగిన సంఘటన నిరూపిస్తోంది. పామును పెంపుడు జంతువుగా పెంచుకోవాలని అనుకున్నాడు ఓ వ్యక్తి. అనుకున్నదే తడవుగా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి మరీ ఓ సర్పాన్ని కొనుగోలు చేశాడు. దాన్ని ఇంట్లో పెట్టి పోషించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత అది తన యజమానిని కాటేసింది. చివరకు ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
 
ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాగ్ ప్రావిన్స్‌కు చెందిన లియు అనే వ్యక్తి పామును పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఆన్ లైన్ లో మీటరు పొడవుండే కోబ్రాను ఆర్డర్ చేశాడు. సాధారణంగా ఇలాంటి పెంపుడు పాములకు ముందుగానే కోరలు పీకి వినియోగదారులకు అందజేస్తారు. ఇదే విషయాన్ని అమ్మకదారుడు లియూకు కూడా చెప్పాడు. అనంతరం పామును లియూ అడ్రస్‌కు డెలివరీ చేశారు. అప్పటి నుంచి లియూ ఆ పామును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ, పెంచుకుంటున్నాడు.
 
అయితే ఓ రోజు లియూ మంచంపై నిద్రిస్తుండగా... ఆ పాము అతడిపై తొడపై కాటేసింది. వెంటనే చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. తక్షణమే అప్రమత్తం కావడం వల్ల లియూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పాము కోరల్లో విషముందని అప్పటికి గానీ తెలియలేదు. కాస్త ఆలస్యమైతే, పాము కాటు వేసిన శరీర భాగాన్ని తొలగించాల్సి వచ్చేదని, దీంతో పాటు ప్రాణం కూడా పోయి ఉండేదని వైద్యులు తెలిపారు.
 
పాముకు విషం ఉండటం ఏంటని లియూ, సంబంధిత విక్రేతను సంప్రదించాడు. తప్పు తమదేనని, పొరపాటున విషమున్న పామును డెలివరీ చేశామని అమ్మకందారుడు ఒప్పుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం బాధితుడి వంతైంది. దీంతో పామును పెంపుడు జంతువుగా పెంచుకోకూడదని అతడు నిర్ణయం తీసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments