Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సార్స్' మరణ మృదంగాన్ని దాటేసిన కరోనా

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (11:23 IST)
పుష్కరకాలం క్రితం ప్రపంచాన్ని సార్స్ వైరస్ షేక్‌కు గురిచేసింది. ఈ సార్స్ వైరస్ దెబ్బకు దాదాపు 700 మంది వరకు చనిపోయారు. ఒక వైరస్ సోకి చనిపోవడం ఇదే హైలెట్‌గా నిలిచింది. కానీ, ఇపుడు ఈ సంఖ్యను కరోనా వైరస్ మృతుల సంఖ్య అధికమించింది. 
 
గత 2002-03 సంవత్సరంలో సార్స్ వైరస్ ప్రపంచాన్ని వణికించింది. దీనిదెబ్బకు వందలాది మంది మృత్యువాతపడ్డారు. దాదాపు 18 సంవత్సరాల క్రితం వచ్చిన సార్స్ 774 మందిని బలితీసుకోగా (అధికారిక లెక్కలు), ఇప్పుడు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 900 దాటింది. కరోనా మృతులు వేల సంఖ్యలోనే ఉన్నారన్న అనుమానాలు ఉన్నా, చైనా ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు మాత్రం ఇవే.
 
ఇపుడు కరోనా ఎలాగైతే చైనాలో వెలుగులోకి వచ్చిందో, నాడు సార్స్ కూడా చైనాలోనే తొలిసారి బయటకు వచ్చింది. ఈ రెండు వైరస్‌లూ ఒకే క్రిమి కుటుంబానికి చెందినవి కావడం గమనార్హం. ఈ రెండింటినీ జీవాయుధాలుగా చైనాయే స్వయంగా అభివృద్ధి చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
 
ఇక, ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం, చైనాలో 40 వేల మంది వరకూ కరోనా సోకి బాధపడుతున్నారు. అందులో 6,188 మంది పరిస్థితి విషమంగా ఉంది. కొత్తగా 3 వేల మంది వరకూ అనుమానితులు ఆసుపత్రుల్లో చేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments