Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో కరోనా కల్లోలం : పెరిగిపోతున్న మృతుల సంఖ్య...

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (10:31 IST)
చైనాల కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారినపడి మృత్యువాతపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చైనా సర్కారు ఎన్న రకాలైన చర్యలు తీసుకుంటున్నా తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ఈ వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య ఆదివారానికి 800 దాటగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ మరణాల సంఖ్య 900కు చేరింది. ఒక్క ఆదివారమే ఏకంగా 97 మంది చనిపోయారు. ఇది చైనా పాలకులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఆదివారం నాడు ఏకంగా 97 మంది రోగులు మరణించినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ స్థాయిలో రోగులు మరణించడం చైనాలో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఈ ఘటనతో కరోనా మృతుల సంఖ్య 900కు చేరినట్టు సమాచారం. ప్రస్తుతం చైనాలో మొత్తం 40,171 మంది ఈ వ్యాధితో పోరాడుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటూ.. రోగుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధం అవుతోంది. 
 
మరోవైపు, కరోనాపై చైనా ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించిన వైద్యుడు లీ వెన్‌లియాంగ్‌ మృతిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన మృతిపై విచారణ జరిపేందుకు చైనా ప్రభుత్వం వుహాన్‌కు దర్యాప్తు బృందాన్ని పంపింది. వైరస్‌ గురించి గత డిసెంబర్‌లోనే లీ వెల్లడించారు. అయితే 'వదంతులు' వ్యాప్తి చేయొద్దని పోలీసులు ఆయనను హెచ్చరించి వదిలేశారు. 
 
అనంతరం రోగులకు చికిత్స చేస్తున్న క్రమంలో వైరస్‌ బారినపడి గురువారం ప్రాణాలు కోల్పోయారు. లీ మృతి పట్ల చైనా వ్యాప్తంగా తీవ్ర విచారం వ్యక్తమవుతున్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రపంచం ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కూడా లీ మృతికి సంతాపం  తెలిపింది. 
 
కరోనాపై తాము 'ప్రజాయుద్ధం' మొదలుపెట్టామని, అమెరికా కూడా తగిన సహకారం అందించాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌‌తో ఫోన్‌లో కోరారు. కాగా, కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి పాంగోలిన్స్‌ (అలుగు) ద్వారా మనుషులకు సంక్రమించి ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments