కరోనా వైరస్ చైనాలో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇతర దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. థాయ్‌లాండ్, హాంకాంగ్‌లలో కరోనా పీడితుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. భారత్‌కు కూడా సోకిన ఈ వైరస్ కారణంగా అనేకమంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే చైనా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కుటుంబం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరింది. కరోనా లక్షణాలతో వీరు ఆసుపత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 10కి చేరింది.
మరోవైపు కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 637 మంది మృతి చెందారని, 25వేల మందికి వైరస్ సోకిందని చైనా ప్రకటించింది. అయితే.. వాస్తవంగా మృతి చెందిన వాళ్లు 25 వేలమంది ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చైనాకు చెందిన ఓ వార్త సంస్థ ప్రచురించింది.
24,589 మంది కరోనా వైరస్ బారిన పడి చనిపోయారని.. ఇంకా 25వేల మందికి కరోనా సోకిందని చైనా ప్రకటిస్తున్నా అందులోనూ తప్పుడు సమాచారమే ఇచ్చిందని సదరు వార్తా సంస్థ వెల్లడించింది.
వాస్తవానికి వైరస్ సోకినవాళ్లు లక్షా 54వేల మంది అని టెన్సెంట్ పేర్కొంది. ఫిబ్రవరి 1న చైనా అధికారులు చెప్పిన సంఖ్య కంటే ఇది పది రెట్లు ఎక్కువ. అయితే, ఈ గణాంకాలు ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ వార్తలో ఎంతమేరకు నిజముందో తెలియాల్సి వుంది.