Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరిలోనే చైనాలో అన్ని కరోనా కేసులా?

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (14:46 IST)
చైనాలో ఫిబ్రవరి మధ్య నాటికే 2.32 లక్షల కరోనా కేసులు ఉండేవని ఓ అధ్యయనం వెల్లడించింది. 'మొదటి దశ వైరస్‌ వ్యాప్తిలో చైనాలో కనీసం 2,32,000 పాజిటివ్‌ కేసులు ఉండేవని ఫెంగ్‌వూ నేతృత్వంలోని హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ బాధితులను గణించే ప్రమాణాల ఆధారంగా జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయినట్లు పరిశోధకులు తెలిపారు. దీనిని ప్రముఖ వైద్య జర్నల్‌ లాన్సెట్‌లో ప్రచురించారు.
 
చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) ప్రకారం బుధవారం నాటికి ఆ దేశంలో 82,789 కేసులు నమోదు కాగా 4,632 మంది మరణించారు. అధ్యయనం ప్రకారం ఈ సంఖ్యకు నాలుగురెట్ల కేసులు అక్కడ ఉంటాయి. కోవిడ్‌-19 రోగుల సంఖ్య, వైరస్‌ ప్రభావాన్ని తగ్గించి చెబుతోందని చైనాపై ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాలు మూకుమ్మడిగా విమర్శిస్తున్నాయి. 
 
జనవరిలో అమలు చేసిన 'కరోనా వైరస్‌ కేసుల డెఫినెషన్‌'ను ఉపయోగించి వుంటే చైనాలో ఫిబ్రవరి 20 నాటికి అధికారులు చెప్పిన 55,000 కాకుండా 2,32,000 ధ్రువీకరించిన కేసులు ఉండేవని తాజా అధ్యయనం తెలిపింది. విస్తృత ప్రమాణాలను వినియోగిస్తే ఇప్పుడు కేసులకు నాలుగు రెట్లు బాధితులు ఉండేవారని వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో కరోనా వైరస్‌ మహమ్మారి బయటపడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments