Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణ ధృవంపై భారత సంతతి బ్రిటీష్ మహిళ... సరికొత్త చరిత్ర

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (18:24 IST)
భూమండలంపై అత్యంత చలి ప్రదేశంగా పేరుగాంచిన దక్షిణ ధృవంపై భారత సంతతికి చెందిన బ్రిటీష్ సిక్కు మహిళ అడుగుపెట్టారు. తద్వారా ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆమె పేరు ప్రీత్ సాంది. బ్రిటీష్ సైన్యంలో ఫిజియోథెరపిస్టుగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఆమె ఒంటరిగా దక్షిణ ధృవానికి వెళ్లారు. మొత్తం 40 రోజుల పాటు 700 మైళ్ళ దూరం ప్రయాణించి పెద్ద సాహసమే చేశారు. పైగా, ఇలాంటి సాహసోపేతమైన యాత్రను ఒంటరిగా పూర్తి చేసిన తొలి మహిళ ప్రీత్ చాంది కావడం గమనార్హం. కొంతదూరం స్కీయింగ్ చేస్తూ, కొంతదూరం నడుస్తూ మొత్తం 40 రోజుల్లో 1126 కిలోమీటర్లు ప్రయాణం చేసి జనవరి 3వ తేదీన దక్షిణ ధృవానికి చేరుకున్నారు. 
 
దక్షిణ ధృవంపై ఆమె అడుగుపెట్టిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన సాహసం వివరాలను ఆమె వ్యక్తిగత బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. ఈ యాత్ర మొదలుపెట్టినపుడు ఈ ఖండం గురించి తనకు పెద్దగా తెలియదు. అయితే, ఇలాంటి యాత్రల కోసం రెండున్నరేళ్ళ పాటు శిక్షణ తీసుకున్నట్టు చెప్పారు. ఫ్రెంచ్ ఆల్ఫ్స్ పర్వతాల్లో, ఐస్‌లాండ్‌లోనూ ఆమె సాధన చేశారు. 
 
భూమండలంపై అత్యంత చల్లని, ఎత్తైన, విపరీతమైన గాలులతో కూడిన ఖండి అంటార్కిటికా. ఇక్కడు జీవుల మనుగడ అత్యంత క్లిష్టమైనది. ఈ యాత్ర సందర్భంగా ఆమె తన వెంట 90 కేజీల బరువున్న స్లెడ్జి, తన కిట్, ఇంధనం, ఆహారం తీసుకెళ్లింది. మహిళా సైనికాధిరాకి ప్రీత్ చాందీ ఘతన పట్ల బ్రిటీష్ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments